- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Nani Pilla Zamindar Movie Actress Haripriya, See How She is Looks Now
Pilla Zamindar Movie: నాని ‘పిల్ల జమీందార్’ మూవీ హీరోయిన్ గుర్తుందా..? ఆమె భర్త కూడా నటుడే.. ఎవరంటే..
న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే సరిపోదా శనివారం సినిమా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ నాని కెరీర్ ప్రారంభంలో చేసిన హిట్ చిత్రాల్లో పిల్ల జమీందార్ ఒకటి. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో హరిప్రియ కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో బింధు మాధవి మోడ్రన్ గర్ల్ గా కనిపిస్తే అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించింది హరిప్రియ.
Updated on: Sep 07, 2024 | 8:43 PM

న్యాచురల్ స్టార్ నాని ఇటీవలే సరిపోదా శనివారం సినిమా హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. కానీ నాని కెరీర్ ప్రారంభంలో చేసిన హిట్ చిత్రాల్లో పిల్ల జమీందార్ ఒకటి. ఈ కామెడీ ఎంటర్టైనర్ లో హరిప్రియ కథానాయికగా నటించింది.

ఈ చిత్రంలో బింధు మాధవి మోడ్రన్ గర్ల్ గా కనిపిస్తే అచ్చమైన పదహారణాల తెలుగమ్మాయిగా కనిపించింది హరిప్రియ. ఈ సినిమా తర్వాత తెలుగులో అబ్బాయ్ క్లాస్ అమ్మాయి మాస్ , ఈ వర్షం సాక్షిగా చిత్రాల్లో నటించింది.

అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా చిత్రంలోనూ నటించింది. ఆ తర్వాత మరో తెలుగులో సినిమాలో కనిపించలేదు. కానీ కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. అక్కడ స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది ఈ భామ.

గతేడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టింది హరిప్రియ. ప్రముఖ విలన్, కేజీఫ్ నటుడు వశిష్టను ప్రేమ వివాహం చేసుకుంది. వశిష్ట.. నారప్ప, నయీం డైరీస్, ఓదెల రైల్వే స్టేషన్ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు.

ఇటీవలే చాందినీ చౌదరి నటించిన ఏవమ్ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించాడు వశిష్ట. పిల్ల జమీందార్ సినిమాలో క్యూట్ గా కనిపించిన హరిప్రియ ఇప్పుడు కాస్త బొద్దుగా మారడం చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.




