Sankranti Movies: 2001 సీన్ రిపీట్ కానుందా.? స్నేహితుల మధ్య మళ్లీ యుద్ధం ఖాయమా.?

23 ఏళ్లైంది తెలుగు ఇండస్ట్రీలో ఆ అద్భుతం జరిగి..! ఇన్నేళ్లలో ఒక్కసారి కూడా మళ్లీ ఆ సీన్ అభిమానులకు కనిపించలేదు. కానీ 2025 సంక్రాంతికి.. అంటే 24 ఏళ్ళ తర్వాత సేమ్ సీన్ రిపీట్ కాబోతుంది. దాంతో అభిమానులు మాత్రమే కాదు.. ఇండస్ట్రీ కూడా ఆ అరుదైన సీన్ కోసం వేచి చూస్తున్నారు. ఇంతకీ ఏంటది..? 2025 సంక్రాంతికి ఏం జరగబోతుంది..?

Dr. Challa Bhagyalakshmi - ET Head

| Edited By: Prudvi Battula

Updated on: Sep 07, 2024 | 4:03 PM

సంక్రాంతి అనేసరికి మన సీనియర్ హీరోలకు ఎక్కడ లేని ఊపొస్తుంది. ఏడాదంతా ఊరికే ఉన్నా.. ఏడాది తొలి పండక్కి రావడానికి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తుంటారు. కుర్రాళ్లను కాదని.. అంతా మేమే అంటూ రేసులోకి వస్తుంటారు. 2025 సంక్రాంతికి ఇదే సీన్ రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. చిరంజీవి, వెంకటేష్ మాత్రమే కాదు.. బాలయ్య కూడా జాయిన్ అవుతున్నారిప్పుడు.

1 / 5
 ఈ మధ్య చిరంజీవి, బాలయ్య ఎక్కువగా సంక్రాంతికి పోటీ పడుతున్నారు. 2017, 2023ల్లో వచ్చి ఇద్దరూ విజయం సాధించారు. అయితే చిరు, బాలయ్యతో పాటు వెంకీ వచ్చి 24 ఏళ్ళైంది. 2001 సంక్రాంతికి నరసింహనాయుడు, మృగరాజు జనవరి 11న విడుదలైతే.. 15న దేవీపుత్రుడుతో వెంకటేష్ వచ్చారు. ఆ తర్వాత మళ్లీ ఇన్నేళ్లకు 2025 సంక్రాంతికి ముగ్గురూ పోటీ పడేలా ఉన్నారు.

2 / 5
బింబిసారా ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటిస్తున్న సోసియో ఫాంటసీ సినిమా విశ్వంభర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఈ సినిమా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

3 / 5
 అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమా సైతం పొంగల్ రేసులోనే ఉంది. ఈ సినెమా టైటిల్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుంది. త్వరలో మరిన్ని విషయాలు వెల్లడించనున్నారు మేకర్స్. 

4 / 5
లేటెస్ట్‌గా బాలయ్య NBK109ను కూడా పండక్కే ప్లాన్ చేస్తున్నారు ఈ సినిమా మేకర్స్. ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా. ఈ ముగ్గురూ వస్తే.. 2025 పూర్తిగా సీనియర్ల సంక్రాంతి అయిపోయింది. ఇదే జరిగితే 24 ఏళ్ళ తర్వాత ఈ అరుదైన పోటీని మళ్లీ చూస్తారు ఆడియన్స్.

5 / 5
Follow us