Chiranjeevi: 30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. ఆపన్న హస్తం అందించడంలోనూ ముందున్న మెగా ఫ్యామిలీ

ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్నహస్తం అందించడంలో ముందుంటుంది మెగా ఫ్యామిలీ. కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందరూ మెగా హీరోలు ఏదో ఒక రూపంలో ఇతరులకు సాయపడుతూనే ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు.

Chiranjeevi: 30 రోజుల్లో రూ.9.4 కోట్లు.. ఆపన్న హస్తం అందించడంలోనూ ముందున్న మెగా ఫ్యామిలీ
Mega Family
Follow us

|

Updated on: Sep 05, 2024 | 10:05 PM

ఎవరైనా ఆపదలో ఉంటే ఆపన్నహస్తం అందించడంలో ముందుంటుంది మెగా ఫ్యామిలీ. కేవలం మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కాదు పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నాగబాబు, రామ్ చరణ్, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందరూ మెగా హీరోలు ఏదో ఒక రూపంలో ఇతరులకు సాయపడుతూనే ఉన్నారు. సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఈ కారణంగానే ఈ ఫ్యామిలీ హీరోలకు అశేషమైన అభిమాన గణం ఉంది. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల వరద బాధితులను ఆదుకోవడంతో మరోసారి మెగా ఫ్యామిలీ ఔదార్యం చూపించింది. కేవలం నెల వ్యవధిలోనే మెగా ఫ్యామిలీ నుంచి రూ.9. 4 కోట్ల సాయం అందిందంటే సాయం చేయడంలో మెగా ఫ్యామిలీ ఎంత ముందుందో ఇట్టే అర్థంచేసుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితులను ఆదుకోవడానికి చిరంజీవి కోటి విరాళం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు చెరో 50 లక్షల విరాళం అందించారు. ఇక తండ్రి బాటలోనే తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా రెండు రాష్ట్రాలకు కలిపి కోటి రూపాయల భారీ విరాళాన్ని ప్రకటించారు.

ఇక ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవర్ స్టార్ పవన కల్యాణ్ భూరి విరాళమే అందించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం ఏకంగా రూ. 6 కోట్ల ఆర్థిక సాయం ప్రకటిచారు. ఇందులో ఏపీ, తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్స్‌కు కోటి చొప్పున ప్రకటించారు పవన్. అలాగే ఏపీలోని వరద ప్రభావానికి గురైన 400 పంచాయతీలకు లక్ష రూపాయల చొప్పున అంటే మొత్తం 4 కోట్లు ఆర్థిక సహాయం చేస్తున్నట్లు వెల్లడించారు పవర్ స్టార్.

ఇక మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల కోసం రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అలాగే నాగబాబు తనయుడు, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెండు తెలుగు రాష్ట్రాలకు 10 లక్షల విరాళం అందించారు. AP డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ సూచించిన పంచాయతీ రాజ్ శాఖకు 5 లక్షలు, మొత్తం 15 లక్షలు విరాళంగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

అంతకుముందు కేరళలోని వయనాడ్‌ బాధితుల కోసం కూడా చిరంజీవి, రామ్ చరణ్ భారీ విరాళం అందేజేశారు. స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి కోటి రూపాయల చెక్కును అందజేశారు చిరంజీవి. మొత్తానికి సినిమా రికార్డుల్లోనే కాదు సాయంలోనూ ముందుంటామని మెగా హీరోలు మరోసారి నిరూపించుకున్నారు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.