- Telugu News Photo Gallery Cinema photos Hero Vijay thalapathy next The GOAT craze in Tollywood Telugu Heroes Photos
The GOAT: ప్రభాస్ ఫ్యాన్స్‌ను తమిళ హీరో విజయ్ టార్గెట్ చేసారా.? క్లారిటీ ఇదిగో..
ప్రభాస్ ఫ్యాన్స్‌ను తమిళ హీరో విజయ్ టార్గెట్ చేసారా.? లేదంటే గోట్ విడుదల సందర్భంగా తెలుగు ఆడియన్స్ అందరికీ ఒకేసారి బిస్కెట్ వేస్తున్నారా..? అదేంటి.. ఆయనకేం అవసరం.. అయినా తెలుగులో కూడా విజయ్ మార్కెట్ బాగానే ఉంది కదా అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీ చూసేయండి.. మీకే అర్థమవుతుంది. సినిమా సినిమాకు తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు విజయ్.
Updated on: Sep 06, 2024 | 9:44 PM

ప్రభాస్ ఫ్యాన్స్‌ను తమిళ హీరో విజయ్ టార్గెట్ చేసారా.? లేదంటే గోట్ విడుదల సందర్భంగా తెలుగు ఆడియన్స్ అందరికీ ఒకేసారి బిస్కెట్ వేస్తున్నారా..? అదేంటి.. ఆయనకేం అవసరం..

అయినా తెలుగులో కూడా విజయ్ మార్కెట్ బాగానే ఉంది కదా అనుకుంటున్నారా.? అయితే ఈ స్టోరీ చూసేయండి.. మీకే అర్థమవుతుంది. సినిమా సినిమాకు తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నారు విజయ్.

ఒకప్పుడు పోస్టర్ ఖర్చులు కూడా రావన్నారు కానీ ఇప్పుడు విజయ్ సినిమా వస్తే పాతిక కోట్లు ఖాయమైపోయాయి. ప్రస్తుతం గోట్‌తో మన ఆడియన్స్‌ను సెప్టెంబర్ 5న పలకరింబోతున్నారు విజయ్.

ఈలోపే ఈయన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుందిప్పుడు. ఎందుకో తెలియదు కానీ తెలుగులో మాస్టర్, బీస్ట్, లియో లాంటి సినిమాలపై ఉన్న హైప్.. గోట్‌కు కనిపించట్లేదు.

మరో మూడు రోజుల్లోనే సినిమా వస్తున్నా.. ఆ హడావిడి లేదు. ఈ టైమ్‌లోనే ప్రభాస్ సలార్ సినిమాను విజయ్ హైదరాబాద్‌లోని ఓ మాస్ థియేటర్‌లో.. సెకండ్ క్లాస్‌లో కూర్చుని చూసారనే వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.

దాంతో దెబ్బకు విజయ్ వైరల్ అవుతున్నారు. గత డిసెంబర్‌లో సలార్ విడుదలైంది. ఆ టైమ్‌లో హైదరాబాద్‌లోనే ఉన్న విజయ్.. సలార్ సినిమాను సిటీలోనే బెస్ట్ మాస్ థియేటర్‌లో చూసారని చెప్పారు నటుడు వైభవ్.

మల్టీప్లెక్స్‌లో చూస్తే కిక్ రాదని.. సెకండ్ క్లాస్‌లో ఆ సినిమా చూసారని చెప్పుకొచ్చారు. సరిగ్గా గోట్ రిలీజ్ టైమ్‌లో సలార్ మ్యాటర్ వైరల్ కావడం.. సినిమా ప్రమోషన్‌కు బాగానే హెల్ప్ అవుతుంది.




