Saripodhaa Sanivaaram: రూ.100 కోట్ల దిశగా ‘సరిపోదా శనివారం’

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29 న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన రోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజున 24.11 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండు రోజుల్లో 36 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Saripodhaa Sanivaaram: రూ.100 కోట్ల దిశగా  'సరిపోదా శనివారం'

|

Updated on: Sep 05, 2024 | 10:01 PM

నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సరిపోదా శనివారం సినిమా ఆగస్టు 29 న భారీ స్థాయిలో థియేటర్లలో విడుదలై హిట్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. విడుదలైన రోజునే ఈ సినిమా సక్సెస్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజున 24.11 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. రెండు రోజుల్లో 36 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఇక మూడో రోజుతో కలుపుకొని 52.18 కోట్ల మార్క్ ను టచ్ చేసింది. నాలుగో రోజున 68.52 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ లెక్కలన్నీ కూడా ఏ రోజుకు ఆ రోజు డీవీవీ బ్యానర్ వారు స్పెషల్ పోస్టర్స్ ద్వారా వెల్లడించారు. ఈ వారం నానీకి పోటీ ఇచ్చే తెలుగు సినిమాలేవీ బరిలో కనిపించడం లేదు. అందువలన ‘సరిపోదా శనివారం’ జోరు వసూళ్ల పరంగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమా 100 కోట్ల క్లబ్ ను టచ్ చేయడం ఖాయం అంటున్నారు. మాస్ ఇమేజ్ కోసం ట్రై చేస్తున్న నానికి ఇది బ్రేకి ఇచ్చినట్టే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని

‘రివెంజ్ సేవింగ్స్’ చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి

“కాందహార్ హైజాక్‌” వెబ్‌సీరీస్‌ కాంట్రవర్సీ.. నెట్‌ఫ్లిక్స్ బాస్‌కు సమన్లు

‘కిల్లర్’ తోడేళ్లకు.. చిన్నారుల మూత్రంతో తడిపిన బొమ్మలు ఎర

Follow us