దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని

బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళల దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా బాలానగర్ ఏసిపి హనుమంత్ రావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మా(60), బంధువులైన బొజ్జగాని దీనమ్మ(62), బొజ్జగాని నాగేంద్రమ్మ(70), వెంకట రమణమ్మ(50)

దృష్టి మరల్చి.. భలే చోరీ చేస్తారు.. ఫ్యామిలీ ఫ్యామిలీ ఇదే పని

| Edited By: Phani CH

Updated on: Sep 06, 2024 | 11:19 AM

బంగారు దుకాణాలలో దృష్టి మరల్చి చోరీలకు పాల్పడుతున్న ఓ మహిళల దొంగల ముఠాను జగద్గిరిగుట్ట పోలీసులు అరెస్ట్ చేసారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా బాలానగర్ ఏసిపి హనుమంత్ రావు వివరాలు వెల్లడించారు. ఖమ్మం జిల్లా గోకరాజుపల్లికి చెందిన బొజ్జగాని జ్ఞానమ్మా(60), బంధువులైన బొజ్జగాని దీనమ్మ(62), బొజ్జగాని నాగేంద్రమ్మ(70), వెంకట రమణమ్మ(50), బాలసాని అశోక్(27), బాలసాని వేంకటపతిలతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకుంది. నగరానికి వచ్చి ఓ కారులో బంగారు దుకాణాల వద్దకు వినియోగదారులుగా ప్రవేశించి, దుకాణంలో సిబ్బందిని దృష్టి మరల్చి వారు. వారిలో ఒకరు అసలు బంగారు ఆభరణాలతో, వారు వెంట తెచ్చుకున్న నకిలీ బంగారు ఆభరణాలతో మార్చి వేసి అక్కడి నుండి ఉడాయించేవారు. ఈ విధంగా ఈ ముఠా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో 3 దుకాణాలు, జీడిమెట్ల పరిధిలో ఓ దుకాణం, చైతన్యపురి పరిధిలోని ఓ దుకాణంలో చోరీకి పాల్పడ్డారు. బంగారు దుకాణాల యాజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠాలోని నలుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. ముఠా నాయకురాలు బొజ్జగని జ్ఞానమ్మ, కారు డ్రైవర్ బాలసాని వేంకటపతి పరారీలో ఉన్నారు. గతంలో ఈ ముఠాలోని దీనమ్మ పై 11, నాగేంద్రమ్మ పై 12, వెంకట రమణమ్మ పై 12 కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదై ఉన్నాయని, నిందితులను కోర్టులో హాజరు పరుచనున్నట్లు ఏసిపి తెలిపారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

‘రివెంజ్ సేవింగ్స్’ చేయండి.. భవిష్యత్​లో కోటీశ్వరులు అవ్వండి

“కాందహార్ హైజాక్‌” వెబ్‌సీరీస్‌ కాంట్రవర్సీ.. నెట్‌ఫ్లిక్స్ బాస్‌కు సమన్లు

‘కిల్లర్’ తోడేళ్లకు.. చిన్నారుల మూత్రంతో తడిపిన బొమ్మలు ఎర

Follow us