AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Telugu 8: హీటెక్కించిన బిగ్ బాస్ సెకెండ్ వీక్ నామినేషన్స్.. లిస్టులో మొత్తం 8 మంది.. ఎవరంటే?

మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే బేబక్క చాలా బెటర్ అని, అయినా ఆమెని మొదటి వారమే పంపించేశారంటూ కొంత మంది బిగ్ బాస్ పై మండి పడుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే సోమవారం అంటేనే అందరికీ నామినేషన్స్ గుర్తుకు వస్తాయి. రెండో వారం కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ హీట్ ఎక్కించింది.

Bigg Boss Telugu 8: హీటెక్కించిన బిగ్ బాస్ సెకెండ్ వీక్ నామినేషన్స్.. లిస్టులో మొత్తం 8 మంది.. ఎవరంటే?
Bigg Boss Telugu 8
Basha Shek
|

Updated on: Sep 09, 2024 | 6:05 PM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. మొదటి వీక్ లోనే కంటెస్టెంట్స్ తమ సత్తా ఏపాటిదో చూపించారు. అయితే మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ చాలా మందిని ఆశ్చర్యపరిచింది. హౌస్ లో ఉన్న చాలా మంది కంటెస్టెంట్స్ కంటే బేబక్క చాలా బెటర్ అని, అయినా ఆమెని మొదటి వారమే పంపించేశారంటూ కొంత మంది బిగ్ బాస్ పై మండి పడుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే సోమవారం అంటేనే అందరికీ నామినేషన్స్ గుర్తుకు వస్తాయి. రెండో వారం కూడా ఈ నామినేషన్స్ ప్రక్రియ హీట్ ఎక్కించింది. తాజాగా దీనికి సంబంధించిన సోమవారం నాటి ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేసారు. ఎప్పట్లాగానే ఈ వారం నామినేషన్స్ లో కూడా కంటెస్టెంట్లు ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. మాటల తూటాలతో బిగ్ బాస్ హౌస్ లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ‘నీకు పర్సనాలిటీ ప్రాబ్లమ్‌ ఉంది, నీకింకా మెచ్యూరిటీ రావాలి’ అని సోనియా ఆకుల సూక్తులు చెప్పడంతో సీతకు మండిపోయింది. ‘నాకెంత క్లారిటీ ఉందో నాకు తెలుసు, ముందు నువ్వు గేమ్‌ను అర్థం చేసుకుని నాకు వివరించు, అసలు ముందు నీకు క్లారిటీ లేదు’ అని ఇచ్చిపడేసింది కిర్రాక్ సీత. దీంతో సోనియా.. ఎక్కువ మాట్లాడొద్దు, పిచ్చి మాటలు మాట్లాడకు అని సీరియస్‌ అయింది

ఆ తర్వాత ప్రేరణను కూడా నామినేట్‌ చేసింది సీత ‘ బయట ఆల్‌రెడీ ఉన్న ఫ్రెండ్‌షిప్‌ను మీరు ఇంట్లో ఫాలో అవండి, కానీ పక్కవాళ్లు కూడా ఫాలో అవాలని చెప్పే హక్కు నీకు లేదు’ అంటూ ప్రేరణను నామినేట్ చేయడానికి గల కారణాన్ని వివరించింది సీత. కాగా మొదటి వారం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేషన్స్ లోకి వచ్చారు. అయితే  ఈ వారం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంకా పూర్తిగా క్లారిటీ రావాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ ను చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..

  • నిఖిల్‌
  • నైనిక
  • సీత
  • మణికంఠ
  • శేఖర్‌ బాషా
  • ఆదిత్య
  • పృథ్వీ
  • విష్ణుప్రియ

రెండో వారంలో కూడా నామినేషన్స్ లోకి వచ్చిన  మణికంఠ, శేఖర్ భాషా, విష్ణప్రియ, పృథ్వీ..

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
ఏడాది పాటు నిల్వ ఉండే ఉసిరికాయ పచ్చడి.. పక్కా కొలతలతో
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
చరిత్ర సృష్టించిన సైమన్ హర్మర్.. 130 ఏళ్ల రికార్డ్ బ్రేక్..!
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శివ మాల వేసిన యాంకర్ స్రవంతి.. ఫొటోస్ ఇదిగో
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
శుక్రవారం ఈ చిన్న పనులు చేస్తున్నారా? లక్ష్మీదేవి అనుగ్రహంతో..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఆ హీరోయిన్ కు పాట పాడితే నా గొంతుకు 2 రోజులు రెస్ట్ ఇచ్చేదాన్ని..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
ఈ 5 రకాల వ్యక్తులతో ఎప్పుడూ శత్రుత్వం పెట్టుకోకండి.. జీవితంలో..
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
3 ఏళ్ల క్రితం వన్డే ప్రపంచకప్ ఫైనల్.. మరి ఇప్పుడేం చేస్తున్నారంటే
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
'నా కూతురిపై అలాంటి వార్తలు రాస్తారా?'.. అర్జున్ తీవ్ర ఆగ్రహం
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
లక్నో కెప్టెన్సీ రేసులో ముగ్గురు.. హింట్ ఇచ్చేసిన టామ్ మూడీ..!
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..
కష్టాల్లో ఉన్నప్పుడు ఆ టాలీవుడ్ హీరో నాకు తిండి పెట్టాడు..