Nani: బామ్మను స్టేజి పైకి పిలిచి మరీ ఫొటోలు దిగిన నాని, ప్రియాంక.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?

వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టాడు. అలాగే హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. కాగా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ఇటీవలే సరిపోదా శనివారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో నాని ఓ బామ్మని స్టేజిపైకి పిలిపించి మరీ ఫొటో దిగాడు.

Nani: బామ్మను స్టేజి పైకి పిలిచి మరీ ఫొటోలు దిగిన నాని, ప్రియాంక.. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా?
Nani
Follow us
Basha Shek

|

Updated on: Sep 08, 2024 | 1:45 PM

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన సరిపోదా శనివారం సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతోంది. ఆగస్టు 29న రిలీజైన ఈ సినిమా వంద కోట్లు సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో ఎస్ జే సూర్య విలన్ గా అదరగొట్టాడు. అలాగే హీరోయిన్ గా ప్రియాంక అరుళ్ మోహన్ అభినయం అందరినీ ఆకట్టుకుంది. కాగా సినిమా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న సందర్భంగా ఇటీవలే సరిపోదా శనివారం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. అయితే ఈ ఈవెంట్లో నాని ఓ బామ్మని స్టేజిపైకి పిలిపించి మరీ ఫొటో దిగాడు. అందుకు సంబంధించిన ఫొటోలు కూడా సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అయితే ఇంతకీ ఆ బామ్మ ఎవరు? అని చాలా మంది ఆరా తీయగా ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే.. సినిమా రిలీజ్ కి ముందు సరిపోదా శనివారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆర్ టీసీ క్రాస్ రోడ్స్ లోని సుదర్శన్ థియేటర్ లో నిర్వహించారు. అక్కడికి కూడా ఈ బామ్మ వచ్చింది. అసలే ఫుల్ జనాలు ఉండే ఈవెంట్. పైగా అంతా యూత్ నే. అలాంటి కార్యక్రమానికి బామ్మ రావడం చూసి నాని ఆశ్చర్యపోయాడు. మొదట హీరోయిన్ ప్రియాంక నానికి జనాల్లో కూర్చున్న బామ్మని చూపించింది. ఆమెను చూసిన నాని తెగ సంబర పడిపోయాడు. ‘బామ్మ గారు మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఈ రోజు ఈవెంట్లో మీరే స్పెషల్ హైలెట్’ అని అన్నారు. దీంతో అప్పుడు ఆ బామ్మ వైరల్ గా మారారు.

ఇవి కూడా చదవండి

ఇప్పుడు మరోసారి ఆ బామ్మ నెట్టింట బాగా వైరల్ అవుతున్నారు. సరిపోదా శనివారం సక్సెస్ మీట్ కు కూడా ఈ బామ్మ వచ్చింది. ఇది గమనించిన నాని ఈవెంట్ పూర్తయ్యాక బామ్మని స్టేజి మీదకి పిలిపించాడు. హీరోయిన్ ప్రియాంక, బామ్మతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు. నాని, ప్రియాంక ఇద్దరూ బామ్మని ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని మరీ ఫొటోలు దిగడం అక్కడి వారిని ఆశ్చర్యపరిచింది. ఇక సోషల్ మీడియాలోనూ ఈ బామ్మ ఫోటోలు, వీడియోలు మరోసారి వైరల్ గా మారాయి.

 బామ్మతో హీరో నాని, ప్రియాంకలు.. వీడియో ఇదుగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
చలికాలంలో ఇలా చేస్తే చక్కని ఆరోగ్యం మీ సొంతం !!
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
కొత్త బట్టలు ఉతక్కుండా వేసుకుంటున్నరా.. జాగ్రత్త
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
నాగుపాము తలపై నిజంగానే మణి ఉంటుందా.. నిజమెంత ??
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
మహిళలూ మీ రవికలు జాగ్రత్త.. వీడి చేతికి దొరికితే అంతే సంగతులు
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
ఎలక్ట్రికల్ సామాన్లు బుక్‌ చేస్తే పార్శిల్‌లో డెడ్‌బాడీ వచ్చింది!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
పుట్టిన బిడ్డను టాయిలెట్‌లో ఫ్లష్‌ చేసి చంపేసిన సహజీవన జంట.!
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
ఢిల్లీలో పుష్ప.. గంగమ్మ వేషంలో తగ్గేదేలే అంటూ.! వీడియో వైరల్..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!