Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు

సెప్టెంబర్ 7న సాయంత్రం 5 గంటల ప్రాంతంలో దీపిక ఆసుపత్రిలో చేరింది. దీపిక తన తల్లి ఉజ్జల పదుకొనేతో కలిసి ముంబైలోని రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి వెళ్లారు. ఆమె శనివారం ఆసుపత్రికి వెళ్లినప్పుడు తీసిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా.. వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
Deepika Padukone - Ranveer Singh
Follow us
Ram Naramaneni

|

Updated on: Sep 08, 2024 | 1:44 PM

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే అమ్మ అయ్యారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం ఉదయం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ గుడ్ న్యూస్‌తో ఆమె కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. దీపిక – రణ్‌వీర్‌ సింగ్‌ జంటకు అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో గర్భం దాల్చినట్లు దీపికా దంపతులు ప్రకటించిన విషయం తెలిసిందే.

తమ మొదటి బిడ్డను స్వాగతించడానికి రెండు రోజుల ముందు… దీపికా, రణవీర్ దంపతులు ముంబై నగరంలోని సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించారు. తమ కుటుంబంలోని కొత్త రాబోతున్న బేబీకి మంచి ఆరోగ్యం ఇవ్వాలని గణేశుడ్ని ప్రార్థించారు. ఆ సమయంలో తీసిన ఫోటోలు వైరల్ అయ్యాయి.

కాగా సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘రామ్ లీలా’ మూవీలో దీపికా – రణ్‌వీర్‌ కలిసి నటించారు. ఈ షూటింగ్‌ సమయంలోనే వీళ్ల లవ్ స్టోరీ మొదలైంది. ఇరు కుటుంబాల అంగీకారంతో 2018ల ఇటలీలోని లేక్ కోమోలో మ్యారేజ్ చేసుకున్నారు. సినిమాల విషయానికి వస్తే.. ‘రాకీ ఔర్‌ రాణీ కీ ప్రేమ్‌ కహానీ’తో గతేడాది ఆడియెన్స్‌ను అలరించారు రణ్‌వీర్‌. ప్రస్తుతం ఆయన ‘సింగమ్‌ అగైన్‌’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. దీపికా ‘కల్కి 2898 ఏడీ’తో బ్లాక్ బాస్టర్ విజయం అందుకున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.