- Telugu News Photo Gallery Cinema photos Bigg Boss Telugu Season 8 Contestant Naga Manikanta Wife And Daughter Photos Goes Viral
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ కంటెస్టెంట్ నాగ మణికంఠ భార్య, కూతురిని చూశారా? ఫొటోస్ వైరల్
బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచింది. మొత్తం 14 మందితో ప్రారంభమైన ఈ షోలో మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. అయితే ఫస్ట్ వీక్ లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ నాగ మణి కంఠ అని చెప్పవచ్చు
Updated on: Sep 09, 2024 | 9:55 PM

బిగ్‌బాస్ సీజన్ 8 ప్రారంభమై అప్పుడే వారం రోజులు గడిచింది. మొత్తం 14 మందితో ప్రారంభమైన ఈ షోలో మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అయ్యింది. అయితే ఫస్ట్ వీక్ లో అందరి దృష్టిని ఆకర్షించిన కంటెస్టెంట్ నాగ మణి కంఠ అని చెప్పవచ్చు

బిగ్ బాస్ షో ముందు వరకు ఎవరికీ పెద్దగా తెలియని నాగ మణికంఠ.. బిగ్ బాస్ హౌస్ లో అడుగు పెట్టిన మరుక్షనం నుంచే తన లైఫ్, గతం గురించి చెబుతూ వైరల్ అయ్యాడు.

ఎప్పుడూ హౌస్ లోనూ ఒంటరిగా ఉండడం.. ప్రతిసారి తన గతాన్ని గుర్తుచేసుకుంటూ ఏడవడంతో కంటెస్టెంట్స్ తో పాటు బుల్లితెర ప్రేక్షకులు కూడా అసహనానికి లోనయ్యారు.

ఈ క్రమంలోనే నాగమణికంఠ భార్య శ్రీ ప్రియ, కూతురి ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా అతని పెళ్లి వీడియో బాగా ట్రెండ్ అవుతోంది.

కాగా బిగ్‌బాస్ షోకు వెళ్లమని భార్య బాగా సపోర్ట్ చేసిందని, షాపింగ్ కోసం డబ్బులు కూడా ఇచ్చిందని హౌస్ లో చెప్పుకొచ్చాడు నాగ మణికంఠ

అయితే బిగ్‌బాస్ 8 ప్రారంభమైన రోజు మణికంఠ తన వైవాహిక బంధం కూడా సరిగా లేనట్లు చూపించారు. అతను కూడా తన భార్యతో విడిపోయినట్లుగా కూడా మాట్లాడాడు.