- Telugu News Photo Gallery Cinema photos Kalki, Pushpa, Devara, Hanuman Other Variety Ganesh Idols Goes Viral On Vinayaka Chavithi Special
Ganesh Chaturthi 2024: పుష్ప టు దేవర.. అబ్బురపరస్తోన్న వెరైటీ వినాయకులు.. ఫొటోస్ ఇదిగో
దేశమంతా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా చాలా చోట్ల వెరైటీ వినాయకులు మండపాల్లో పూఉలందుకుంటున్నారు. పుష్ప 2, కల్కి, దేవర, హనుమాన్, సలార్.. ఇలా సినిమా హీరోల రూపాలతో కూడిన గణనాథులు అబ్భుర పరుస్తున్నాయి.
Updated on: Sep 09, 2024 | 9:23 PM

దేశమంతా వినాయక చవితి నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. గతంలో లాగే ఈసారి కూడా చాలా చోట్ల వెరైటీ వినాయకులు మండపాల్లో పూఉలందుకుంటున్నారు. పుష్ప 2, కల్కి, దేవర, హనుమాన్, సలార్.. ఇలా సినిమా హీరోల రూపాలతో కూడిన గణనాథులు అబ్భుర పరుస్తున్నాయి.

ఎన్టీఆర్ నటిస్తోన్న ది మోస్ట్ అవైటెడ్ మూవీ దేవర. ఇందులో ఎన్టీఆర్ పాత్ర ఎంతో పవర్ ఫుల్ గా ఉండనుంది. ఇప్పుడి దేవర రూపంతో వినాయకుడు కొలువు దీరాడు

ఇటీవలే రిలీజైన కల్కి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడిదే థీమ్ తో తమిళనాడులో అశ్వత్థామ విగ్రహాలు ఏర్పాటు చేశారు భక్తులు.

ఇక కల్కి లాగే ప్రభాస్ సలార్ విగ్రహం కూడా కొలువు దీరింది. అనంతపూర్ లో సలార్ గణేశుడిని ప్రతిష్టించారు. భక్తులు పెద్ద ఎత్తున దర్శనం కోసం వస్తున్నారు

ఈ ఏడాది రిలీజై బ్లాక్ బస్టర్ కొట్టిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా హీరోగా నటించాడు. ఇందులో హనుమంతుడి స్ఫూర్తితో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చాడు.

కొన్ని రోజుల క్రితమే భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్ ను గెల్చుకుంది. ఈ క్రమంలో చాలా చోట్ల రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, భారత క్రికెటర్ల రూపాలతో విగ్రహాలు ప్రతిష్ఠించారు.