AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT: థ్రిల్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?

మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగులో. ఆసక్తికరమైన కథా కథనాలతో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఈ ఏడాది మే24న విడుదలైంది. చిన్న సినిమాగా విడుదలై మాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT: థ్రిల్ చేసేందుకు ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?
Thalavan Movie
Basha Shek
|

Updated on: Sep 10, 2024 | 9:45 AM

Share

మరో మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగులో. ఆసక్తికరమైన కథా కథనాలతో మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఈ ఏడాది మే24న విడుదలైంది. చిన్న సినిమాగా విడుదలై మాలీవుడ్ బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అదే రణం హీరో విలన్ బిజూ మేనన్, ఆసీఫ్ అలీ హీరోలుగా న‌టించిన తలవాన్ . ఓ పోలీస్ ఆఫీస‌ర్ జీవితంలో జ‌రిగిన నిజ జీవిత ఘ‌ట‌న‌ల ఆధారంగా ద‌ర్శ‌కుడు జిస్ జాయ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. మియా జార్జ్‌, అనుశ్రీ హీరోయిన్లుగా న‌టించారు. రూ. 10 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ మూవీ ఓవరాల్ గా రూ. 30 కోట్లకు పైగానే వసూళ్లు సాధించం విశేషం. థియేటర్లలో మలయాళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న తలవాన్ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 10న తలవాన్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ఇది వరకే ప్రకటించింది. అయితే ఓ రోజు ముందుగానే అంటే సెప్టెంబ‌ర్ 9 నుంచే త‌ల‌వాన్‌ను సోనీలివ్‌లోకి వచ్చేసింది. సోమ‌వారం సాయంత్రం ఆరు గంట‌ల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చేసింది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ బ్లాక్ బస్టర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.

తలవాన్ సినిమాలో బిజు మీన‌న్‌, ఆసిఫ్ అలీ పోలీస్ ఆఫీస‌ర్లుగా నటించారు. వీరి యాక్టింగ్‌తో పాటు క‌థలోని ట్విస్ట్ మ‌ల‌యాళ ఆడియెన్స్‌ను ఆక‌ట్టుకున్నాయి. ఇద్ద‌రు పోలీస్ ఆఫీస‌ర్ల మ‌ధ్య ఉన్న గొడ‌వ‌లు, వారి ఈగో చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఎస్ఐ కార్తిక్ వాసుదేవ‌న్ (ఆసిఫ్ అలీ) ట్రాన్స్‌ఫ‌ర్‌పై సీఐ జ‌య‌శంక‌ర్ (బిజు మీన‌న్‌) ప‌నిచేస్తోన్న పోలీస్ స్టేష‌న్‌కు వ‌స్తాడు. అయితే కార్తిక్ దుండుడుకు తనం మ‌న‌స్త‌త్వం జ‌య‌శంక‌ర్‌కు అసలు న‌చ్చ‌దు. ఈ సమయంలో ఓ కేసులో అరెస్ట్ అయిన మ‌నుదాస్ అనే స్నేహితుడిని జ‌య‌శంక‌ర్ అనుమ‌తి లేకుండా కార్తిక్ రిలీజ్ చేస్తాడు. దీంతో ఇద్దరికీ గొడవలు మొదలవుతాయి. అదే సమయంలో జయశంకర్ ఓ హత్య కేసులో ఇరుక్కుంటాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తలవాన్ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

సోని లివ్ లో స్ట్రీమింగ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
తెలంగాణ TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్ లింక్
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
ప్రపంచంలోనే అతి చిన్న రైలు, ముచ్చటగా 3బోగీలు,300మంది ప్యాసింజర్లు
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
తెలుగమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఇప్పుడు చర్చిలో పాస్టర్‏..
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
మీ జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడా.. ఈ సమస్యలు తప్పవు!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
శని సంచారం.. అందృష్టం కలిసి వచ్చే నాలుగు రాశులు ఇవే!
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
గోల్డ్, సిల్వర్ కాదు, రికార్డులు తిరగరాస్తున్న మరో మెటల్
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
వైకుంఠ ఏకాదశికి ముందురోజు తప్పక పాటించాల్సిన నియమమిది..
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
ఆ గ్రామంలో మందు ముట్టుకుంటే మడతడి పోద్ది.! ఉన్నది మన తెలంగాణలోనే.
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
థార్‌లో రీల్స్ చేసి ట్రెండ్ అవుదామనుకున్నాడు.. కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..
భరించలేని కడుపు నొప్పితో ఆస్పత్రికి వెళ్లిన మహిళ, కట్‌చేస్తే..