AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలోని  మల్లి గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్

నాటు నాటు తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆకట్టుకున్న మరో సాంగ్ ‘కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా..అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాలా' ఈ పాట ఎంతో బాగుందో.. అందులో ఒక చిన్నారి పలకించిన చక్కని ఎక్స్‌ప్రెషన్స్ కూడా అంతే బాగున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కథనే ఆ గోండు జాతి పిల్లతో  మొదలవుతోంది

RRR Movie: ఆర్ఆర్ఆర్ సినిమాలోని  మల్లి గుర్తుందా? ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? లేటెస్ట్ ఫొటోస్ వైరల్
Child Actress Twinkle Sharma
Basha Shek
|

Updated on: Sep 11, 2024 | 12:48 PM

Share

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన మరో అద్భుత కళా ఖండం ఆర్ఆర్ఆర్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా ఆనటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 2022 మార్చి 25న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లతో పాటు ఆస్కార్ లాంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు ఎన్నో గెల్చుకుంది. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్ గణ్, సముద్రఖని, రాజీవ్ కనకాలు, రాహుల్ రామకృష్ణ తదితర ఫేమస్ యాక్టర్స్ నటించారు. ఇక కీరవాణి అందించిన పాటలు చార్ట్ బస్టర్ గా నిలిచాయి. నాటు నాటు సాంగ్ అయితే చిన్నా, పెద్దా అందరినీ ఆలరించింది. వరల్డ్ వైడ్ గా ఈ సాంగ్ బాగా ఫేమస్ అయిపోయింది. నాటు నాటు తర్వాత ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆకట్టుకున్న మరో సాంగ్ ‘కొమ్మ ఉయ్యాలా కోన జంపాలా..అమ్మ ఒళ్లో నేను రోజూ ఊగాలా’ ఈ పాట ఎంతో బాగుందో.. అందులో ఒక చిన్నారి పలకించిన చక్కని ఎక్స్‌ప్రెషన్స్ కూడా అంతే బాగున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా కథనే ఆ గోండు జాతి పిల్లతో  మొదలవుతోంది. మల్లి పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించిన చిన్నారి ఎవరో తెలుసుకుందాం రండి. ఆ పాప అసలు పేరు ట్వింకిల్ శర్మ. ఛత్తీస్ గఢ్ లోనే పుట్టి పెరిగింది.

ట్వింకిల్ శర్మకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే పలు డ్యాన్స్ రియాలిటీ షోల్లో పాల్గొంది. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో డ్యాన్స్ ఇండియా డ్యాన్స్‌లోనూ మెరిసింది. పలు ప్రకటనల్లోనూ నటించింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ప్లిఫ్ కార్ట్ యాడ్ లో ట్వింకిల్ శర్మను చూసిన రాజమౌళి ఆమెన ఆర్ ఆర్ఆర్ మూవీకి తీసుకున్నారట. అలా మొత్తానికి ఒక చారిత్రాత్మక సినిమాలో ఈ అమ్మాయి భాగమయ్యింది. కాగా ఆర్ఆర్ఆర్ సినిమా విడుదలకు ముందు చిన్న పిల్లలా కనిపించింది ట్వింకిల్ శర్మ. అయితే ఇప్పుడు బాగా మారిపోయింది. సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది. తన లేటెస్ట్ ఫొటోలు, వీడియోలను అందులో షేర్ చేస్తుంటుంది. మరి ఇప్పటికే నెట్టింట ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న ట్వింకిల్ శర్మ భవిష్యత్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

ట్వింకిల్ శర్మ లేటెస్ట్ ఫొటోస్..

Twinkle Sharma

Twinkle Sharma

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.