The GOAT OTT: డిలీటెడ్ సీన్స్‌తో ఓటీటీలోకి ‘ది గోట్’.. దళపతి విజయ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ నటించిన తాజా చిత్రం ది గోట్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంక‌ట్ ప్ర‌భు తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాడు. మీనాక్షి చౌద‌రి, స్నేహ హీరోయిన్లుగా న‌టించారు. మరో బ్యూటీ క్వీన్ త్రిష స్పెష‌ల్ సాంగ్‌లో సందడి చేసింది

The GOAT OTT: డిలీటెడ్ సీన్స్‌తో ఓటీటీలోకి 'ది గోట్'.. దళపతి విజయ్ సినిమా స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
The Goat Movie
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2024 | 4:20 PM

కోలీవుడ్ స్టార్ హీరో ద‌ళ‌ప‌తి విజ‌య్ నటించిన తాజా చిత్రం ది గోట్.. ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంక‌ట్ ప్ర‌భు తెరకెక్కించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ లో విజయ్ తండ్రీ కొడుకులుగా డ్యూయల్ రోల్ పోషించాడు. మీనాక్షి చౌద‌రి, స్నేహ హీరోయిన్లుగా న‌టించారు. మరో బ్యూటీ క్వీన్ త్రిష స్పెష‌ల్ సాంగ్‌లో సందడి చేసింది. ప్ర‌శాంత్‌, ప్ర‌భుదేవా, జ‌య‌రాం కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. శివ‌కార్తికేయ‌న్‌, ధోనీ గెస్ట్ పాత్ర‌ల్లో ఆడియెన్స్‌ను సర్ ప్రైజ్ ఇచ్చారు. సెప్టెంబర్ 05న తమిళంతో పాటు తెలుగులోనూ రిలీజైన ది గోట్ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చింది. అయితే టాక్ తో సంబంధం లేకుండా ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. ముఖ్యంగా తమిళనాడులో విజయ్ సినిమాకు కాసుల వర్షం కురుస్తోంది. నాలుగు రోజుల్లోనే ది గోట్ సినిమా వరల్డ్ వైడ్ గా 280 కోట్ల కలెక్షన్లు రాబట్టినట్లు ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. వినాయక చవితికి తోడు వీకెండ్ కలిసి రావడంతో ది గోట్ కలెక్షన్లు భారీగా పెరిగాయని తెలుస్తోంది. ఇదిలా ఉంటే థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురుస్తోన్నది గోట్ సినిమా ఓటీటీ గురించి ఒక ఆసక్తికర విషయం వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ విజయ్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేట్రికల్ రిలీజ్ కు ముందే ఓటీటీ సంస్థకు, మేకర్స్ కు మధ్య భారీ డీల్ సెట్ అయ్యిందట

ఇవి కూడా చదవండి

కాగా ది గోట్ సినిమా ఓటీటీ ర‌న్‌టైమ్ దాదాపు 18 నిమిషాలు పెర‌గ‌నుందట. ఓటీటీ వెర్ష‌న్‌ కోసం ఓ యాక్ష‌న్ ఎపిసోడ్‌, సాంగ్‌తో పాటు విజ‌య్ కామెడీ సీన్స్‌ను యాడ్ చేయాల‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు భావిస్తున్నారట. థియేట‌ర్ల‌లో నిడివి ఎక్కువవుతుందని సుమారు 18 నిమిషాల సీన్స్ ను కట్ చేశారట. ఇప్పుడు ఈ సీన్స్ ను ఓటీటీ వెర్షన్ లో యాడ్ చేయాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. థియేటర్లలో ది గోట్ మూవీ రన్ టైమ్ సుమారు మూడు గంటల మూడు నిమిషాలు. కానీ ఓటీటీ వెర్షన్ లో మాత్రం మూడు గంట‌ల ఇర‌వైఒక్క నిమిషాల ర‌న్‌టైమ్‌ ఉండనుందట. కాగా అక్టోబర్ 25 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ది గోట్ సినిమా స్ట్రీమింగ్ కు రావొచ్చునని తెలుస్తోంది.

ఆగని కలెక్షన్ల వర్షం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.