Bigg Boss Telugu 8: ‘అది నోరా? డ్రైనేజీనా’.. సోనియాపై నెటిజన్ల ఆగ్రహం.. విష్ణుప్రియను అలా అనడంతో..
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం (సెప్టెంబర్ 09) నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. హోరాహోరీగా సాగిన నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. మాటల తూటాలు పేలాయి. అయితే ఈసారి ఈ మాటలు చాలా శ్రుతి మించాయి. ముఖ్యంగా విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ సోనియా ఆకుల వాడిన పదజాలం సరిగ్గా లేదన్న విమర్శలు వస్తున్నాయి
బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ రెండో వారంలోకి అడుగుపెట్టింది. సోమవారం (సెప్టెంబర్ 09) నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభమైంది. హోరాహోరీగా సాగిన నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ ఒకరిపై ఒకరు రెచ్చిపోయారు. మాటల తూటాలు పేలాయి. అయితే ఈసారి ఈ మాటలు చాలా శ్రుతి మించాయి. ముఖ్యంగా విష్ణుప్రియ గురించి మాట్లాడుతూ సోనియా ఆకుల వాడిన పదజాలం సరిగ్గా లేదన్న విమర్శలు వస్తున్నాయి. రెండో వారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా విష్ణుప్రియ ఇద్దరిని ఎంచుకుంది. మొదట నాగ మణికంఠను నామినేట్ చేసిన ఈ స్టార్ యాంకర్ ఆ తర్వాత సోనియాను ఎంచుకుంది. ఇక్కడే వీరిద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. నిజం చెప్పాలంటే హౌస్ లో ఇక చిన్నపాటి యుద్దమే జరిగింది. అయితే యాంకర్ విష్ణుప్రియపై సోనియా చేసిన వ్యాఖ్యలు మాత్రం చాలా నీచంగా ఉన్నాయంటున్నారు నెటిజన్లు. ఆట గురించి మాట్లాడకుండా పర్సనల్ ఎటాక్‌కు దిగిందంటూ సోనియాపై మండి పడుతున్నారు. ఇంతకు విష్ణుప్రియ మీద సోనియా ఎలాంటి కామెంట్లు చేసిందంటే.. .
‘నువ్వు ముందు బట్టలు సరిగ్గా వేసుకోవు.. అలాంటి దుస్తులతోనే ఇతరుల పక్కన నిల్చుంటావ్.. నీ వల్ల వారు అసౌకర్యంగా ఫీలవుతున్నా పట్టించుకోవు. నీ మాటలు, చేతలకు చాలా తేడాలున్నాయి. నీకు ఫ్యామిలీ లేదేమో.. నువ్వు ఏం చేసినా నీ ఫ్యామిలీ చూడకపోవచ్చు, కానీ, నన్ను మాత్రం నా కుటుంబం చూస్తుంది. నిన్ను అడల్ట్స్ జోక్స్ వేయడానికే బిగ్ బాస్ షోకి పిలిచారనుకుంటాను. నన్ను మాత్రం అలాంటి వాటి కోసం పిలవలేదు. గతంలో అడల్ట్ కామెడీ షోలో ఉన్నావ్ కాబట్టే నిన్ను ఇప్పుడు బిగ్‌బాస్‌కు పిలిచారు’ అంటూ దారుణంగా తిట్టింది సోనియా. ప్రస్తుతం ఈ ఆర్జీవీ బ్యూటీ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఆమె నోరుని డ్రైనేజీతో పోలుస్తూ నెటిజన్లు మండిపడుతున్నారు. సోనియా కామెంట్స్ పై హోస్ట్ నాగార్జున గట్టిగా హెచ్చరించాలంటున్నారు. మరికొందరు సోనియాను ఎలిమినేట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్లే..
- నిఖిల్
- నైనిక
- సీత
- మణికంఠ
- శేఖర్ బాషా
- ఆదిత్య
- పృథ్వీ
- విష్ణుప్రియ
రంగు పడుద్ది,, బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లేటెస్ట్ ప్రోమో చూశారా?
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.