Tollywood: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే.. మిస్టర్ బచ్చన్‏తోపాటు..

మాస్ మాహరాజా రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అలాగే మరికొన్ని సూపర్ హిట్ మూవీస్ కూడా ఈసారి ఓటీటీలోకి రాబోతున్నాయి.

Tollywood: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే.. మిస్టర్ బచ్చన్‏తోపాటు..
Ott Movies
Follow us
Rajitha Chanti

|

Updated on: Sep 10, 2024 | 6:17 PM

ఓటీటీ ప్లాట్ ఫామ్స్‏లోకి ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్ వచ్చేస్తున్నాయి. ఇక సెప్టెంబర్ రెండో వారం కూడా ఇంట్రెస్టింగ్ మూవీ రాబోతున్నాయి. ఈవారం సినీ ప్రియుల కోసం టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ హిట్ అయిన చిత్రాలు స్ట్రీమింగ్ కాబోతున్నాయి. అవేంటో చూసేద్దామా. మాస్ మాహరాజా రవితేజ నటించిన లేటేస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించింది. ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ అందుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి రాబోతుంది. అలాగే మరికొన్ని సూపర్ హిట్ మూవీస్ కూడా ఈసారి ఓటీటీలోకి రాబోతున్నాయి. ఇంతకీ ఆ సినిమాలేంటో తెలుసుకుందామా.

మిస్టర్ బచ్చన్..

మాస్ మాహరాజా రవితేజ, డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబోలో వచ్చిన లేటేస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమా మిక్డ్స్ టాక్ అందుకుంది. ఇక ఇప్పుడు సెప్టెంబర్ 12న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషలలో అందుబాటులోకి రానుంది.

ఇవి కూడా చదవండి

ఆయ్..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై సూపర్ హిట్ అయిన సినిమా ఆయ్. నార్నే నితిన్, నయన్ సారిక, కసిరెడ్డి రాజ్ కుమార్ కీలకపాత్రలలో నటించిన ఈ మూవీ ఆగస్ట్ 15న విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 12న నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతోపాటు దక్షిణాది అన్ని భాషలలోనూ ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది.

కమిటీ కుర్రోళ్లు..

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించి థియేటర్లలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా కమిటీ కుర్రోళ్లు. మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించిన ఈ రూరల్ కామెడీ ఆగస్ట్ 9న విడుదలై సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈ సినిమా సెప్టెంబర్ 12 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

బాలుగానీ టాకీస్..

ఇక ఇప్పటివరకు అసలు విడుదల కానీ బాలుగాని టాకీస్ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. సెప్టెంబర్ 13వ తేదీని ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్రంలో శివ రామచంద్రవరపు, శరణ్య శర్మ, రఘు కుంచె ప్రధాన పాత్రలు పోషించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.