OTT Movie: అప్పుడే ఓటీటీలోకి సూపర్ హిట్ కామెడీ ఎంటర్ టైనర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ మధ్యన థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయ .పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్ సంగతి పక్కన పెడితే.. మీడియాం బడ్జెట్, చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు నెల రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. అలా ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఒక సూపర్ హిట్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది.
ఈ మధ్యన థియేటర్లలో రిలీజైన సినిమాలు నెలరోజులకే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయ .పెద్ద సినిమాలు, భారీ బడ్జెట్ మూవీస్ సంగతి పక్కన పెడితే.. మీడియాం బడ్జెట్, చిన్న సినిమాలు ఓటీటీలోకి వచ్చేందుకు నెల రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. అలా ఇటీవలే థియేటర్లలో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ఒక సూపర్ హిట్ సినిమా త్వరలోనే ఓటీటీలోకి వస్తోంది. అదే సీనియర్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం మారుతీనగర్ సుబ్రహ్మణ్యం. లక్ష్మణ్ కార్య తెరకెక్కించిన ఈ సినిమాలో ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ కీలక పాత్రల్లో నటించారు. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ భార్య తబిత సుకుమార్ ఈ సినిమాతోనే ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. రిలీజుకు ముందే ఈ సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. . ప్రమోషన్లలో స్వయంగా డైరెక్టర్ సుకుమార్ తో పాటు స్టార్ హీరో అల్లు అర్జున్ పాల్గొనడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే ఆగస్టు 23న థియేటర్లలోకి వచ్చిన మారుతి నగర్ సుబ్రమణ్యం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. బాక్సాఫీస్ వద్ద ఓ మోస్తరు వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా రావు రమేష్ యాక్టింగ్ పై ప్రశంసలు వచ్చాయి. థియేటర్లలో ఆడియెన్స్ ను పొట్ట చెక్కలయ్యేలా నవ్వించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం త్వరలోనే డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ మీదకు రానుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది.
ఈ నేపథ్యంలో మారుతీ నగర్ సుబ్రమణ్యం ఓటీటీ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువరించింది ఆహా. ‘మేడం, సర్ త్వరలో ఆహాలో సందడి చేయబోతున్నారు. త్వరలోనే మారుతీనగర్ సుబ్రమణ్యం ఓటీటీలో సందడి చేయనుంది’ అంటూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేసింది. అయితే స్ట్రీమింగ్ డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.బహుశా సెప్టెంబర్ 20 నుంచి మారుతీ నగర్ సుబ్రమణ్యం ఓటీటీలోకి రావచ్చేమోనని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ బ్యానర్లపై బుజ్జిరాయుడు పెంట్యాల, మోహన్ కార్య సంయుక్తంగా ఈ మూవీని నిర్మించారు.
ఆహాలో స్ట్రీమింగ్..
Madam, Sir twaralo #aha lo sandadi cheyyabotunnaru.
Get ready to laugh out loud! 🤣 The hilarious #MaruthiNagarSubramanyam is coming soon to #aha! @lakshmankarya @thabithasukumar @sriudayagiri @mohankarya @kalyannayak_ofl @AnkithKoyyaLive @RamyaPasupulet9 @rushi2410 pic.twitter.com/AWx0p6Bjuy
— ahavideoin (@ahavideoIN) September 10, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.