దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..

చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇతర భాషల్లోని సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్తసినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. ఓటీటీలో హారర్ సినిమాల హవా నడుస్తోంది.

దైర్యం ఉంటేనే చూడండి..! థియేటర్ నుంచి జనాలు పారిపోయిన సినిమా ఇది..
Horror Movie
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 11, 2024 | 11:36 AM

ఓటీటీల్లో వణుకుపుట్టించే సినిమాలకు కొదవే లేదు.. ప్రేక్షకులు ఎక్కువగా థ్రిల్లర్, హారర్ జోనర్ సినిమాలు చూడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. చాలా సినిమాలు ఇప్పటికే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇతర భాషల్లోని సినిమాలు కూడా ఇప్పుడు తెలుగులోకి డబ్ అయ్యి స్ట్రీమింగ్ అవుతున్నాయి. కొత్తసినిమాలు థియేటర్స్ లో సందడి చేస్తుంటే.. ఓటీటీలో హారర్ సినిమాల హవా నడుస్తోంది. ఎంత భయమేసిన హారర్ సినిమాలు చూడటంమానరు కొంతమంది. కళ్ళుమూసుకొని భయం భయంగా చూస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీలో అడ్డరగొడుతోంది. ఈ సినిమా చూడాలంటే దైర్యం ఉండాలిసిందే.. ఒంటరిగా ఉన్నప్పుడు చూడకవడం మంచిది.

ఇది కూడా చదవండి : Mahesh Babu: స్టార్ హీరోయిన్స్‌ కూడా కుళ్ళుకుంటారు.. మహేష్ బాబు అన్న కూతురు ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..

ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో ప్రతి సీన్ వెన్నులో వణుకుపుట్టిస్తుంది. ఈ సినిమాను చూసిన జనాలు థియేటర్స్ లోనే వాంతులు చేసుకుంటూ కేకలు వేశారు. మరికొంత మంది థియేటర్స్ నుంచి బయటకు పారిపోయారు కూడా.. అంతే కాదు ఈ సినిమా చూసిన తర్వాత చాలా మంది చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం కూడా చేశారు. కొంతమంది మానసిక స్థితి దెబ్బతింది. దాంతో ఈ సినిమాను చాలా చోట్ల బ్యాన్ కూడా చేశారు.

ఇది కూడా చదవండి : సినిమాలో పద్దతిగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం..! ఈ అమ్మడు గుర్తుందా..?

ఆ సినిమా పేరు ది ఎక్సార్సిస్ట్. బ్రిటన్‌లో ఈ చిత్రాన్ని నిషేధించారు. విలియం పీటర్ బ్లాటీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా 1973లో విడుదలైంది ఈ మూవీ కేవలం 23 థియేటర్స్ లోనే రిలీజ్ అయ్యింది. అత్యంత భయంకరమైన ఈ సినిమాను చాలా చోట్ల నిషేదించారు. అలాగే కొన్ని ప్రాంతాల్లో పిల్లలతో వీక్షించడం నిషేధించబడింది.‘ది ఎక్సార్సిస్ట్’ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న మొదటి హారర్ చిత్రం. ఈసినిమాలో కొన్ని సీన్స్ నిజంగా వణుకుపుట్టిస్తాయి. ఈ సినిమా మనదగ్గర అందుబాటులో లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో రెంట్ విధానంలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. ఈ సినిమాను దైర్యముంటేనే చూడాలి.

ఇది కూడా చదవండి :Bigg Boss 8 Telugu: ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీ యమా హాట్ గురూ..! హౌస్‌లో మరో అందాల భామ.. ఇక రచ్చ రచ్చే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.