AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీ యమా హాట్ గురూ..! హౌస్‌లో మరో అందాల భామ.. ఇక రచ్చ రచ్చే

మణికంఠ, పృథ్వీ ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నారు వీరిలో ఒకరు ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ఎక్కువ శాతం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా లేని క్యాండెట్ అతను ఒక్కడే.

Bigg Boss 8 Telugu: ఈ వైల్డ్ కార్ట్ ఎంట్రీ యమా హాట్ గురూ..! హౌస్‌లో మరో అందాల భామ.. ఇక రచ్చ రచ్చే
Bigg Boss 8
Rajeev Rayala
|

Updated on: Sep 11, 2024 | 10:19 AM

Share

బిగ్ బాస్ సీజన్ 8 లో హౌస్ మేట్స్ నానా రచ్చ చేస్తున్నారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవ్వడంతో ప్రస్తుతం హౌస్ లో 13మంది ఉన్నారు. వీరిలో ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. మణికంఠ, పృథ్వీ ఆదిత్య, నిఖిల్, సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేషన్స్ లో ఉన్నారు వీరిలో ఒకరు ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నారు. అయితే ఎక్కువ శాతం పృథ్వీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. హౌస్ లో పెద్దగా యాక్టివ్ గా లేని క్యాండెట్ అతను ఒక్కడే. మిగతావాళ్ళు ఏదోలా కంటెంట్ ఇస్తున్నారు. కానీ పృథ్వీ పెద్దగా కనబడటం లేదు. దాంతో ఈ వారం అతను హౌస్ నుంచి బయటకు వెళ్లే ఛాన్స్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు వైల్డ్ కార్డు ద్వారా మరికొంతమంది హౌస్ లోకి పంపించనున్నారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Rana Daggubati: రానాతో ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా.? ఆమె చాలా ఫెమస్ హీరోయిన్

ఈ సారి హౌస్ లోకి మరో హాట్ బ్యూటీ ఎంటర్ అవుతుందని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు. సీరియల్స్ లో నటిస్తూ సినిమా హీరోయిన్స్ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న బ్యూటీ జ్యోతి రాయ్. కృష్ణ ముకుంద మురారి సీరియల్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది ఈ అమ్మడు. ఈ సీరియల్ లో కథానాయకుడి తల్లి పాత్రలో నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి: సినిమాలో పద్దతిగా.. బయట మాత్రం బాబోయ్ బీభత్సం..! ఈ అమ్మడు గుర్తుందా..?

సీరియల్ లో పద్దతిగా ఉండే ఈ అమ్మడు బయట మాత్రం యమా హాట్ గురూ.. జ్యోతి రాయ్ తెలుగుతో పాటు ఇతరభాషల్లోనూ పలు సీరియల్స్ చేసింది. ఇక ఇప్పుడు సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుంది. త్వరలోనే ఆమె నటించిన సినిమా అప్డేట్స్ రానున్నాయి. సోషల్ మీడియాలో అందాలతో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ. అందాలు ఆరబోస్తూ కుర్రకారుకు కిర్రెక్కిస్తుంది జ్యోతి. అంతే కాదు ప్రస్తుతం ఓ యంగ్ డైరెక్టర్‌ను రెండో పెళ్లి చేసుకొని జీవనం కొనసాగిస్తోంది. ఇక ఇప్పుడు ఈ హాట్ బ్యూటీని బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారని తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్ కు మరింత గ్లామర్ రానుంది. ఈ బ్యూటీ ఎంట్రీ పై త్వరలోనే క్లారిటీ రానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
APPSC సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
సౌదీలో రియాద్‌ ఎయిర్‌పోర్టుపై దాడి.. హైదరాబాద్‌ వ్యక్తి మృతి
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
ఇండి కూటమికి సీజేఐ షాక్.. మార్చ్‌పై ఉత్కంఠ.. ఢిల్లీలో ఏం జరగనుంది
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
హైదరాబాద్‌ వాటర్‌ బోర్డులో ఉద్యోగాలు.. అక్టోబర్ 17 వరకే ఛాన్స్
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
షాలినీనే టార్గెట్ చేసిన కొత్త కంటెస్టెంట్లు!
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగురాష్ట్రాల్లో ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
అలర్ట్.. ఈ వారంలో బ్యాంక్ సెలవులు ఇవే..
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
రూ.5 కోట్ల లంచం డిమాండ్‌.. పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌!
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!