Shilpa Shetty: ‘గణపతి బప్పా మోరియా’.. నిమజ్ఞనంలో శిల్పా శెట్టి తీన్మార్ డ్యాన్స్.. కూతురితో కలిసి.. వీడియో

సామాన్యులతో పాటు సెలబ్రిటీలు గణేశుడి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకుంది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి నిమజ్ఞన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ముద్దుల తనయ సమీషాతో కలిసి డ్యాన్స్ చేసింది శిల్పాశెట్టి

Shilpa Shetty: 'గణపతి బప్పా మోరియా'.. నిమజ్ఞనంలో శిల్పా శెట్టి తీన్మార్ డ్యాన్స్.. కూతురితో కలిసి.. వీడియో
Shilpa Shetty
Follow us
Basha Shek

|

Updated on: Sep 10, 2024 | 5:59 PM

దేశవ్యాప్తంగా వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. వివిధ ఆకృతుల్లోని గణపతి విగ్రహాలు మండపాల్లో పూజలందుకుంటున్నాయి. ఇక చాలా చోట్ల గణేశుడి విగ్రహాలు నిమజ్ఞనానికి తరలిపోతున్నాయి. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు గణేశుడి ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ ప్రముఖ నటి శిల్పా శెట్టి కూడా వినాయక చవితి పండుగను ఉత్సాహంగా జరుపుకుంది. భర్త రాజ్ కుంద్రా, పిల్లలతో కలిసి గణపతి నిమజ్ఞన కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా తన ముద్దుల తనయ సమీషాతో కలిసి డ్యాన్స్ చేసింది శిల్పాశెట్టి. ఓవైపు డ్రమ్స్ వాయిస్తూనే మరోవైపు కూతురితో కలిసి ఎంతో ఎనర్జిటిక్ గా నృత్యం చేసింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. అంతకు ముందు గణపతి దేవుడిని ఇంటికి సాదరంగా ఆహ్వానించి, భక్తిశ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు శిల్పాశెట్టి దంపతులు. ఆ తర్వాత సాంప్రదాయ బద్ధంగా నిమజ్ఞనం పూజలు నిర్వహించి వినాయకుడికి వీడ్కోలు పలికారు.

ఇవి కూడా చదవండి

గణేశుడి నిమజ్ఞనం వేడుకల్లో శిల్పా శెట్టితో పాటు ఆమె భర్త రాజ్ కుంద్రా, పిల్లలు వియాన్, సమీషా, సోదరి షమితా శెట్టి, తల్లి సునంద కూడా భాగమయ్యారు. అందరూ తమ ఇష్ట దైవానికి హారతి ఇచ్చి, గణపతిబప్పా మోరియా అంటూ ఆనందోత్సాహాల మధ్య గణేశుడికి వీడ్కోలు పలికారు. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో షేర్ చేసింది శిల్పా. ‘మా గన్ను రాజాకు వీడ్కోలు చెప్పడం అంత సులభం కాదు. అత్యంత భక్తి, ప్రేమతో నిండి ఉన్నాం. కానీ భారమైన బాధా తప్త హృదయాలతో వీడ్కోలు పలుకుతున్నాం, వచ్చే ఏడాది మిమ్మల్ని స్వాగతించేందుకు ఎదురు చూస్తూ ఉంటాను’ అంటూ రాసుకొచ్చింది శిల్పా. ప్రస్తుతం ఈ వీడియో గణపతి భక్తులను అమితంగా ఆకట్టుకుంటోంది.

గణేశుడికి పూజలు చేస్తోన్న శిల్పాశెట్టి, రాజ్ కుంద్రా దంపతులు .. వీడియో ఇదిగో

శిల్పాశెట్టి ఘనంగా నిర్వహించిన గణపతి వేడుకలకు పలువురు బాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారు. రకుల్ ప్రీత్ సింగ్,ఆమె భర్త జాకీ భగ్నానీ కూడా సాంప్రదాయ దుస్తులు ధరించి గణేశుడి నిమజ్జనం వేడుకల్లో పాల్గొన్నారు.

కూతురితో కలిసి శిల్పా శెట్టి డ్యాన్స్.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిని ఢీకొట్టిన వాహనం.. ముగ్గురు మృతి
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
పోడియంలోనూ త్రిల్లింగ్ ఇన్సిడెంట్స్.. లైవ్ మ్యాచ్‌లో ఏంజరిగిందంటే
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
అమెరికా షట్‌డౌన్‌.? బైడెన్‌ బిల్లును తిరస్కరించిన ట్రంప్‌..
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
డెడ్ బాడీ ఇంటికి డోర్ డెలివరీ కేసులో కీలక విషయాలు
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
ఓ యువ రైతు వినూత్న ఆలోచన.. విద్యుత్ కాంతుల మధ్య చామంతి సాగు..
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
పుష్ప 2 మూవీ క్లైమాక్స్.. థియేటర్‌లోకి పోలీసుల ఎంట్రీ! ఆ తర్వాత
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
హైవేపై పేలిన గ్యాస్ ట్యాంకర్లు.! ఒకదానినొకటి ఢీకొన్న వాహనాలు..
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
క్యాన్సర్ పేషెంట్లు ఊపిరి పీల్చుకోండి.. వ్యాక్సిన్ వచ్చేస్తోంది.!
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
సఫల ఏకాదశి వ్రతం మహత్యం.. పూజ శుభ సమయం? విధానం ఏమిటంటే..
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!
బొబ్బిలి రాజా ఈజ్ బ్యాక్.! బాలయ్య షోకి వెంకీ.! పోలే.. అదిరిపోలే.!