Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudheer Babu: హీరో సుధీర్ బాబు పక్కన కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరబ్బా? ఇంత క్యూట్‌గా ఉన్నాడు..

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. సినిమా సినిమాకి కొత్త దనం చూపిస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో.

Sudheer Babu: హీరో సుధీర్ బాబు పక్కన కనిపిస్తున్న ఈ కుర్రాడు ఎవరబ్బా? ఇంత క్యూట్‌గా ఉన్నాడు..
Sudheer Babu
Follow us
Basha Shek

|

Updated on: Sep 13, 2024 | 8:58 AM

టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సూపర్ స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చినా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. కమర్షియల్ సినిమాలు చేస్తూనే వైవిధ్యతకు పెద్ద పీట వేస్తుంటాడు. సినిమా సినిమాకి కొత్త దనం చూపిస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో. కొన్ని నెలల క్రితమే ‘హరోం హర’ సినిమాతో మన ముందుకు వచ్చాడు సుధీర్ బాబు. ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లో అదరగొట్టి అభిమానులను అలరించాడు. ఇప్పుడు ‘మా నాన్న సూపర్ హీరో’ అంటూ డిఫరెంట్ మూవీతో మన ముందుకు వస్తున్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో ఆర్ణ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రతిష్ఠాత్మక యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగా గురువారం (సెప్టెంబర్ 12) మా నాన్న సూపర్ హీరో మూవీ టీజర్ లాంచింగ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమానికి హీరో సుధీర్ బాబుతో సహా మూవీ టీమ్ అందరూ హాజరయ్యారు.

కాగా మా నాన్న సూపర్ హీరో మూవీ టీజర్ ఈవెంట్లో సుధీర్ బాబుతో ఉన్న ఓ కుర్రాడు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. తన క్యూట్ స్పీచ్ తో ఆకట్టుకున్నాడు. ఈ కుర్రాడు మాట్లాడిన తీరును చూసి అక్కడున్నవారందరూ చప్పట్లతో అభినందించారు. ఇంతకీ ఆ హ్యాండ్సమ్ కుర్రాడు ఎవరో తెలుసా? సుధీర్ బాబు చిన్న కుమారుడు దర్శన్. ఈ పిల్లాడి గురించి చాలా మందికి కూడా తెలియకపోవచ్చు. కానీ దర్శన్ సూపర్ హిట్ మూవీ ‘సర్కారు వారి పాట’లో మహేష్ చిన్నప్పటి రోల్ చేశాడు. అందులో కనిపించింది కాసేపే అయినా ఆకట్టుకున్నాడు. ఇక దర్శన్ లో స్పెషాలిటీ ఏంటంటే.. ఈ అబ్బాయిలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ పోలికలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని సుధీర్ బాబు కూడా సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పారు. కాగా ప్రస్తుతం దర్శన్ చదువుకుంటున్నారు. అయితే భవిష్యత్ లో కచ్చితంగా హీరో అయ్యే ఛాన్స్ ఉంది.

ఇవి కూడా చదవండి

తాత కృష్ణ పోలికలతో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.