AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gangavva: బిగ్ బాస్ తర్వాత భారీగా పెరిగిన గంగవ్వ ఆస్తులు.. ఇప్పుడు ఎన్ని కోట్లున్నాయో తెలుసా?

బిగ్ బాస్ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కాస్తయినా పాపులారిటీ వస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు ఒక మంచి వేదికగా తోడ్పడుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఛాన్సులు వచ్చే అవకాశముంది. సినిమాల్లో కాకపోయినా టీవీ షోల్లో అయినా కనిపించవచ్చు. వీటితో పాటు ఆర్థికంగానూ బలపడవచ్చు. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది.

Gangavva: బిగ్ బాస్ తర్వాత భారీగా పెరిగిన గంగవ్వ ఆస్తులు.. ఇప్పుడు ఎన్ని కోట్లున్నాయో తెలుసా?
Gangavva
Basha Shek
|

Updated on: Sep 13, 2024 | 10:58 AM

Share

బిగ్ బాస్ షోలో పాల్గొనే ప్రతి ఒక్కరికీ కాస్తయినా పాపులారిటీ వస్తోంది. ప్రొఫెషనల్ లైఫ్ పరంగానూ కెరీర్ బిల్డ్ చేసుకునేందుకు ఒక మంచి వేదికగా తోడ్పడుతుంది. ముఖ్యంగా సినిమా రంగంలో ఛాన్సులు వచ్చే అవకాశముంది. సినిమాల్లో కాకపోయినా టీవీ షోల్లో అయినా కనిపించవచ్చు. వీటితో పాటు ఆర్థికంగానూ బలపడవచ్చు. గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్ ను ఒకసారి పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఈ షోలో పాల్గొన్న వారు సినిమా కెరీర్ పరంగా పికప్ కాకపోయినా ఆర్థికంగా చాలా బలపడ్డారు. ఈక్రమంలోనే బిగ్ బాస్ షో చరిత్రలోనే సంచలనంగా నిలిచిన గంగవ్వ కూడా ఇప్పుడు కోటీశ్వరురాలైపోయారు. తాజాగా ఆమె ఆస్తులు, సంపాదన గురించి మై విలేజ్‌ షో టీమ్‌ ఒక వీడియో రిలీజ్‌ చేసింది. అందులో గంగవ్వ మాట్లాడుతూ.. బిగ్‌బాస్‌ (నాలుగో సీజన్‌) తర్వాత తన జీవితం చాలా మారిందని చెప్పుకొచ్చారు. అలాగే తన ఇల్లు కూడా చూపించారు. ‘ రూ. 22 లక్షలతో ఈ ఇల్లు కట్టుకున్నాను. అలాగే నాకు ఉన్న ఆవుల కోసం రేకుల షెడ్డు కూడా ఏర్పాటు చేశాను. పశువుల మేత కోసం గడ్డిని కూడా పెంచుతున్నాను’ అని గంగవ్వ తెలిపారు.

బిగ్ బాస్ నా జీవితాన్ని మార్చేసింది..

‘ ఆవుల్ని కొని, షెడ్డు నిర్మించడానికి మొత్తం రూ.3 లక్షలు అయింది. అలాగే నాలుగున్నర గుంటల పొలం కూడా కొన్నాను. ఇప్పుడు దీని ధర రూ. 9 లక్షలు. అలాగే మరో చోట రెండున్నర ఎకరాల పొలం ఉంది. ఇది దాదాపు రూ.75-80 లక్షలు పలుకుతోంది’ అని చెప్పిన ఇంకోచోట ఉన్న కమర్షియల్‌ ప్లాట్‌ చూపిస్తూ దీన్ని కొనడానికి సుమారు రూ.3 లక్షలయిందని గంగవ్వ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

మరో చోట వ్యవసాయ భూమిని చూపించిన గంగవ్వ.. ఇక్కడ 15 గుంటల భూమి ఉందని.. దీని విలువ ఏడెనిమిది లక్షల రూపాయలు ఉంటుందని తెలిపింది. మొత్తంగా తన ఇల్లు, వ్యవసాయ భూమి, కమర్షియల్‌ ప్లాట్స్‌ అంతా కలిపి కోటి 24 లక్షల విలువ చేస్తుందన్నారామె. అలాగే తనకంటూ ఐదు తులాల బంగారం ఉందని, ఎప్పటికైనా 50 ఆవులను తీసుకుని వాటిని పెంచుతూ, పాలమ్ముతూ బతకాలన్నదే తన కోరిక అని చెప్పుకొచ్చారు. ఇక తను సంపాదించినదాంట్లో కూతుర్లిద్దరికీ చెరో రూ.2 లక్షలు, మనవరాలి పెళ్లికి రూ.2.5 లక్షలు ఇచ్చానన్నారామె.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు