మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్

రేయ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తేజ్.. కానీ ఈ సినిమా కంటే ముందే పిల్ల నువ్వులేని జీవితం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తేజ్. సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశాడు. వరుస ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్నాడు.

మరీ ఇంత టాలెంటెడ్‌గా ఉన్నవేంటమ్మా..! తేజ్ కోసం అదిరిపోయే పాట పాడిన స్టార్ యాంకర్
Sai Dharam Tej
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 13, 2024 | 11:03 AM

మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే. వారిలో సాయి ధరమ్ తేజ్ ఒకరు. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు తేజ్. రేయ్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తేజ్.. కానీ ఈ సినిమా కంటే ముందే పిల్ల నువ్వులేని జీవితం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు తేజ్. సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేశాడు. వరుస ఫ్లాప్స్ తర్వాత చిత్రలహరి సినిమాతో హిట్ అందుకున్నాడు. ఆతర్వాత సోలో బ్రతుకే సోబెటర్, విరూపాక్ష సినిమాలతో మంచి హిట్ అందుకున్నాడు. చివరిగా మావయ్య పవన్ కళ్యాణ్ తో కలిసి ఓ సినిమా చేశాడు. పవన్ కళ్యాణ్ తో కలిసి బ్రో అనే సినిమా చేశాడు తేజ్. ఈ సినిమా మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకుంది.

ఇది కూడా చదవండి : రోజాతో ఉన్న ఈ పాప ఇప్పుడు.. సోషల్ మీడియాలో సెగలు రేపుతోన్న భామ.. ఎవరో తెలుసా.?

ఇదిలా ఉంటే సాయి ధరమ్ తేజ్ సినిమా కోసం ఓ యాంకర్ పాట పాడిన విషయం మీకు తెలుసా.? తన కెరీర్ లో ఎప్పుడు సింగర్ అవతారమెత్తని ఆమె తేజ్ కోసం ఓ స్పెషల్ సాంగ్ ను పాడింది. అంతే కాదు ఆ సాంగ్ కు మరో యాంకర్ డాన్స్ కూడా చేసింది. తేజ్ హీరోగా నటించిన ఆ సినిమా ఫ్లాప్ అయినా.. పాట మాత్రం మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇంతకూ ఆ సినిమా ఏది.? ఆ యాంకర్స్ ఎవరు.? అనేది చూద్దాం.!

ఇది కూడా చదవండి :Sai Pallavi: ఇదికదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! ముచ్చటగా మూడోసారి ఆ హీరోతో సాయి పల్లవి..

ఆ సినిమా పేరు విన్నర్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టింది. ఈ సినిమాలో తేజ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఇక ఈ సినిమాలో అనసూయ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ పాటను మరో స్టార్ యాంకర్ సుమ కనకాల ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి రచించిన సుయ సుయ అనే సాంగ్ ను సింగర్ అనురాగ్ కులకర్ణితో కలిసి సుమ ఆలపించారు. తన కెరీర్ లో మొదటి సాయి తేజ్ కోసం సుమ పాట పాడారు. ఈ సినిమా నిరాశ పరిచిన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. ఇక సుమ పలు సినిమాల్లోనూ నటించారు. చిన్న చిన్న పాత్రలు చేసిన ఆమె.. మొన్నామధ్య జయమ్మ పంచాయితీ అని ఓ సినిమా చేశారు కూడా..

在 Instagram 查看这篇帖子

Suma Kanakala (@kanakalasuma) 分享的帖子

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.