AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఇదికదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! ముచ్చటగా మూడోసారి ఆ హీరోతో సాయి పల్లవి..

కేవలం నటనతోనే అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మలయాళ సినిమా ప్రేమమ్ తో పరిచయమైనా సాయి పల్లవి ఆతర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. ఇక తెలుగులో చివరిగా విరాటపర్వం సినిమా చేసింది.ఆ అలాగే తమిళ్ లో గార్గి అనే సినిమా చేసింది.

Sai Pallavi: ఇదికదా ఫ్యాన్స్‌కు కావాల్సింది..! ముచ్చటగా మూడోసారి ఆ హీరోతో సాయి పల్లవి..
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Sep 13, 2024 | 9:27 AM

Share

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ మధ్య సినిమాల స్పీడ్ తగ్గించింది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కు భిన్నంగా.. స్కిన్ షో కు దూరంగా ఉంటుంది సాయి పల్లవి. కేవలం నటనతోనే అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మలయాళ సినిమా ప్రేమమ్ తో పరిచయమైనా సాయి పల్లవి ఆతర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. ఇక తెలుగులో చివరిగా విరాటపర్వం సినిమా చేసింది.ఆ అలాగే తమిళ్ లో గార్గి అనే సినిమా చేసింది. ఆతర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి. ఆ టైం లో ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. సాయిపల్లవి ఇక పై సినిమాలు చేయదా.? పెళ్లి చేసుకుంటుందా.? అంటూ రకరకాల ఆనుమానాలు వ్యక్తం అయ్యాయి.

ఇక ఇప్పుడు సాయి పల్లవి కొత్త సినిమా చేస్తోంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మత్యకారుల జీవిత కథతో ఉండనుంది. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు సాయి పల్లవి మరో తెలుగు సినిమాకు గ్రీన్ సింగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఓ స్టార్ హీరోతో మూడో సారి జతకట్టనుంది సాయి పల్లవి. అలాగే తనకు రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడితో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది.

ఆ దర్శకుడు ఎవరో కాదు టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల. ఆయన దర్శకత్వంలో సాయి పల్లవి ఫిదా, లవ్ స్టోరీ సినిమాలు చేసింది. ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఇప్పుడు శేఖర్ కమ్ముల నేచురల్ స్టార్ నానితో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవిని అనుకుంటున్నారట. కాగా నాని, సాయి పల్లవి కలిసి ఎమ్.సీ.ఏ, శ్యామ్ సింగరాయ్ సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి ఈ సూపర్ హిట్ కాంబో రిపీట్ కానుందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది.

Follow Us
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
రేపటి నుంచి TG PGECET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. పూర్తి షెడ్యూల్
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
నిరుద్యోగ అభ్యర్థులకు IBPS భారీ అవకాశం.. నేటి నుంచే దరఖాస్తులు
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
ఆ స్టార్ హీరో సినిమా పై బోలెడన్ని ఆశలు పెట్టుకున్న భామ
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
10th క్లాస్ కూడా పాస్ కాలేదు.. కానీ ఇండస్ట్రీలో తోప్
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
సీఎం రేవంత్‌కు అక్బరుద్దీన్ ఒవైసీ ఆత్మీయ ఆహ్వానం!
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
హార్థిక్ పాండ్యా ట్రేడ్ డీల్.. ఎవ్వరూ ఊహించని టీమ్‌లోకి?
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
పల్లీలు అమృతం మాత్రమే కాదు.. ఈ 5 రకాల వ్యాధులు ఉన్నవారికి డేంజర్!
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
Osmania: సరికొత్త చరిత్ర.. ఉస్మానియాలో ఒకేసారి 5 అవయవాల మార్పిడి
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
చిన్న,పెద్ద ఎవరికైనా సరే.. నడుము బలంగా మారాలంటే ఇవి తినండి..
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!
5 కేజీల ఎల్‌పీజసీ సిలిండర్‌ ధర తగ్గింపు.. జూలై 1 నుంచి అమలు..!