AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pawan Kalyan: కేబీసీలో పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్.. మీరు చెప్పగలరా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍ జనసేన పార్టీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ప్రతీ చోటా గెలిచింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కల్యాణ్. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవర్ స్టార్ పేరు మార్మోగిపోతోంది

Pawan Kalyan: కేబీసీలో పవన్ కల్యాణ్ గురించి ప్రశ్న.. 1.60 లక్షలు గెల్చుకున్న కంటెస్టెంట్స్.. మీరు చెప్పగలరా?
Pawan Kalyan, Amitabh
Basha Shek
|

Updated on: Sep 14, 2024 | 9:27 PM

Share

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‍ జనసేన పార్టీ ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. 100 శాతం స్ట్రైక్ రేట్ తో పోటీ చేసిన ప్రతీ చోటా గెలిచింది. ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం కూటమి ప్రభుత్వంలో ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు పవన్ కల్యాణ్. దీంతో ప్రస్తుతం దేశవ్యాప్తంగా పవర్ స్టార్ పేరు మార్మోగిపోతోంది. తాజాగా ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘కౌన్‍బనేగా కరోడ్‍పతి 16’ పవన్ కల్యాణ్ గురించి ఓ ప్రశ్న వచ్చింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ ఈ క్విజ్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్ కు ఇద్దరు వృద్ధ దంపతులు కంటెస్టెంట్లుగా వచ్చారు. ఈ సందర్భంగా రూ.1,60,000 గెల్చుకునేందుకు గాను పవన్ కల్యాణ్‍ గురించి ఒక ప్రశ్న అడిగారు అమితాబ్. ‘2024 జూన్‍లో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రముఖ సినీ నటుడు ఎవరు? అని వృద్ధ దంపతులను అడిగారు అమితాబ్. దీనికి పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ అనే ఆప్షన్లను ఇచ్చారు. అయితే, వారు దీని సమాధానం కోసం లైఫ్‍లైన్ వినియోగించుకున్నారు. అంతేకాదు ఆడియన్స్ పోల్‍ను కూడా ఎంపిక చేసుకున్నారు. ఇందులో సుమారు 50శాతానికిపైగా పవన్ కల్యాణ్ అని ఆడియన్స్ పోల్ చేశారు. దీంతో వారు కూడా అదే ఆప్షన్ ను లాక్ చేశారు. అలా ఆ వృద్ధ దంపతులు రూ.1,60,000 ప్రశ్నను అధిగమించారు.

కాగా కేబీసీలో పవన్ కల్యాణ్‍ గురించి వచ్చిన ప్రశ్నకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ముఖ్యంగా మెగా అభిమానులు, జనసేన శ్రేణులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం పవన్ కల్యాణ్ చేతిలో మొత్తం మూడు సినిమాలు ఉన్నాయి. ఇందులో సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని పవన్ ముందుగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీంతో పాటు హరిశ్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా చేస్తున్నారు పవన్. అలాగే పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ హరి హర వీరమల్లు మూవీని కూడా పూర్తి చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో…

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్‌ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్‌ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
చికెన్ కడిగితే విషమే.. క్లీనింగ్ పేరుతో మీరు చేస్తున్న అతిపెద్ద..
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!