TOP9 ET: సూపర్ న్యూస్! NTR వైపే.. అల్లు అర్జున్ | 2.57 గంటల అరాచకం దిమ్మతిరిగే రేంజ్‌లో దేవర.
ఇప్పటి వరకు సింగిల్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫీల్డ్ లోకి దిగేస్తున్నాడు. దేవరకు తోడుగా.. పుష్ప రాజ్ రంగంలోకి దిగుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నాడు. అఫీషియలో.. అన్ అఫీషియలో పక్కకు పెడితే.. ఇప్పుడీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను.. ఇటు బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
01.NTR: సూపర్ న్యూస్.! NTR వైపే.. అల్లు అర్జున్
ఇప్పటి వరకు సింగిల్‌గానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఇక ఇప్పుడు ఈయనకు తోడుగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఫీల్డ్ లోకి దిగేస్తున్నాడు. దేవరకు తోడుగా.. పుష్ప రాజ్ రంగంలోకి దిగుతున్నాడు. మరి కొన్ని రోజుల్లో జరగబోయే దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్లో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా వచ్చేస్తున్నాడు. అఫీషియలో.. అన్ అఫీషియలో పక్కకు పెడితే.. ఇప్పుడీ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది. అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ను.. ఇటు బన్నీ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
02.Devara: 2.57 గంటల అరాచకం దిమ్మతిరిగే రేంజ్‌లో దేవర విశ్వరూపం.
అప్పటికే దేవర పై బోలెడు అంచనాలు ఉన్నాయి. ఇక రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌తో ఆ అంచనాలు కాస్తా ఆకాశం అంచుకు చేరాయి. ఇక ఆ అంచునుంచి ఏకంగా అంతరిక్షం పై పైకి పోయేలా.. ఈ సినిమా నుంచి ఓ న్యూస్ బయటికి వచ్చింది. ఈ సినిమా నిడివి 2గంటల 57 నిమిషాలుగా ఉండనుందనే న్యూస్.. మేకర్స్ నుంచి బయటికి వచ్చింది. దీంతో దేవర మూవీ 2గంటల 57 నిమిషాల అరాచకమే.. దిమ్మతిరిగే రేంజ్‌లో దేవర విశ్వరూపం పక్కా అంతే అంటూ.. ఫ్యాన్స్ నుంచి ఓ స్లోగన్ వస్తోంది. అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
03.Nithin: నాని సినిమాను కొట్టేసిన నితిన్.!
తెలిసో.. తెలియకో..! నచ్చో.. నచ్చకో..! ఓ హీరో సినిమా మరో హీరో చేతికి వెళ్లడం కామన్. అయితే నాని, నితిన్ విషయంలోనూ… ఇదే జరిగింది ఇప్పుడు. బలగం సినిమాతో సెన్సబుల్ డైరెక్టర్‌గా మారిన వేణు.. తన రెండో సినిమాగా నానితో కలిసి ఎల్లమ్మ సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. దిల్ రాజు ప్రొడక్షన్లో ఈసినిమాను భారీగానే ప్లాన్ చేశాడు. కానీ ఇప్పుడు అదే సినిమా నితిన్ చేతిలోకి వెళ్లిందట. తొందర్లో ఈ సినిమా నితిన్ హీరోగా తెరకెక్కనుందట.
04.ravitej: రవితేజ సేఫ్..! పూర్తిగా కోలుకున్నట్టే.!
రీసెంట్‌గా ఓ మూవీ షూటింగ్‌లో రవితేజ గాయపడ్డాడు. యాక్షన్ సీన్ చేస్తూ.. హాస్పటిల్ పాలయ్యాడు. ఇంటికే పరిమితం అవ్వాలని రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించడంతో… ఇప్పటిక వరకు బయట కనిపించలేదు. దీంతో ఫ్యాన్స్… రవన్న ఎలా ఉన్నాడని ఆరాతీస్తూ.. నెట్టింట ఎదురుచూడడం మొదలెట్టారు. ఇక ఈకమ్రంలోనే మాస్ రాజా రవితేజ లేటెస్ట్ పిక్ ఒకటి బయటికి వచ్చింది. డైరెక్టర్ బాబీతో.. మాస్ రాజా రవితేజ కలిసి ఉన్న ఫోటోల్లో చేతికి కట్టుతో ఉన్నా కూడా… రవన్న బేషుగ్గా ఉండడం.. ఇప్పుడు రవితేజ ఫ్యాన్స్‌ను ఖుషీ అయ్యేలా చేస్తోంది.
05.vishwak: దేవరపై ట్రోల్స్.. విశ్వక్ స్ట్రాంగ్ రిప్లై.
దేవర ట్రైలర్‌పై.. అందులోని ఎన్టీఆర్ లుక్ పై కామెంట్ చేసిన ఓ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు ఇచ్చిపడేశాడు యంగ్ హీరో విశ్వక్ సేన్. ముందు గోడ సపోర్ట్ లేకుండా కూర్చోవాలని.. ఆ తర్వాత సినిమా పై కామెంట్స్ చేస్తూ.. ఆడియెన్స్‌ను ఉద్దరిద్దువు అంటూ ఆ సోషల్ మీడియా పర్సన్ పై విశ్వక్ సీరియస్ అయ్యాడు. దేవరపై కామెంట్ చేసినందుకు తనకు కాలుతుందని.. కానీ ఆల్రెడీ కాలిపోయిన ఫేస్ తనది అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు. అయితే ఆ సోషల్ మీడియాల ఇన్‌ఫ్లూయెన్సర్ అకౌంట్ పేరు కూడా.. విశ్వక్ సేన్ కావడంతో.. తన పేరు కరాబ్ చేయాడనికే వీడు పుట్టాడంటూ.. తన పోస్ట్‌లో రాసుకొచ్చాడు విశ్వక్.
06.NTR: KGF డైరెక్టర్ సర్‌ప్రైజ్ గిప్ట్ NTR పై స్పెషల్ సాంగ్.
తన బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌తో.. కేజీఎఫ్ సినిమాను ఓ రేంజ్లో లేపిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. రీసెంట్‌గా కన్నడ నాట టెంపుల్ విజిట్‌కు వెళ్లిన ఎన్టీఆర్‌ను హీరో రిషబ్ షెట్టి.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కలిశారు. అయితే ఈ ఫుటేజ్‌కు ఎన్టీఆర్ పేరుతో.. తన స్టైల్లో స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేసిన ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్.. ఇప్పుడా వీడియోను తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్టీఆర్ లుక్స్‌తో.. ఎన్టీఆర్ పేరు మీద తను కంపోజ్ చేసిన బీట్‌తో మరో సారి తారక్ ఫ్యాన్స్‌లో గూస్ బంప్స్ పుట్టిస్తున్నారు ఈయన.
07.ganagvva: తక్కువ అనుకునేరు.. ఏకంగా కోటి సంపాదించిన గంగవ్వ.
గంగవ్వ! ఊర్లో ఉండే ఈ అవ్వ.. తన ట్యాలెంట్‌తో.. యూట్యూబ్ వరకు వచ్చింది. తనకంటూ ఓ క్రేజ్‌ను సంపాదించుకుంది. ఎట్ ప్రజెంట్ సెలబ్రిటీ హోదాను కూడా ఎంజాయ్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే… ఈ అవ్వ తన ఆస్తుల వివరాలను బయటపెట్టింది. బిగ్ బాస్ వల్లే తను డబ్బు వెనకేసుకోగలిగానని చెప్పి గంగవ్వ.. అలా తన దగ్గర దాదాపు కోటి 24 లక్షల రూపాలయల విలువైన ఆస్తులు ఉన్నట్టు చెప్పింది. తను ఎప్పుడూ కనిపించే యూట్యూబ్ ఛానెల్ వేదికగానే .. ఈ వివరాలను వెళ్లడించి… ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది.
08.salman: 42కోట్ల వాచ్ ధరించిన స్టార్ హీరో సల్మాన్.
ఈ సెలబ్రిటీల చేతికి.. కోట్ల ధర పలికే వాచ్‌లు ఉండడం కామన్ అయిపోయింది. వాచ్ దొరికితే చాలు.. లైఫు సెట్టు అనే లైన్ ఇప్పుడు వినిపించడం కాదు కామన్ గా కనిపిస్తోంది. ఇక తాజాగా సల్మాన్ కూడా తన చేతికి ఓ వాచ్ పెట్టుకోవడం.. ఆ వాచ్ ధర అక్షరాలా 42 కోట్లు ఉండడం ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అయితే ఈ వాచ్ సల్మాన్‌ది కాదు.. ఓ లగ్జరీ వాచ్ డిజైనర్‌ది. ఎస్ ! అమెరికన్ జువెలరీ, లగ్జరీ వాచ్ డిజైనర్ జకబ్ అరబో.. తాజాగా తన అభిమాన హీరో సల్మాన్ చేతికి ఓ వాచ్‌ను తొడిగాడు. 714 డైమండ్స్ ఉన్న.. 42 కోట్ల ధర పలికే ఈ వాచ్‌ను కొద్ది సేపు సల్మాన్‌ను పెట్టుకునేందుకు అనుమతినిచ్చాడు. అయితే ఈ వాచ్‌ను ధరించిన సల్మాన్ కొద్ది సేపు ఎగ్జైట్ అవుతూ ఫోటోలకు పోజులిచ్చాడు.
09.malika: అలసిపోయా అంటూ.. సూసైడ్ ముందు హీరోయిన్ కు తండ్రి మెసేజ్.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కమ్ మోడల్, మలైకా అరోరా తండ్రి రీసెంట్‌గా సూసైడ్ చేసుకున్నారు. తన అపార్ట్‌మెంట్లోని పెంట్ హౌస్ నుంచి కిందికి దూకి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. అయితే తాజాగా మలైకా తండ్రి అనిల్ కుల్దీప్ మోహతా చివరి మాటలు ఇప్పుడు బయటికి వచ్చాయి. తన ఇద్దరు కూతుళ్లు, మలైకా.. అమృతాకు ఫోన్ చేసిన అనిల్ కుల్దీప్ మెహతా.. అనారోగ్యంతో బాధపడుతున్నా.. అలసిపోయా అంటూ.. చివరి సారిగా వారిద్దరికీ చెప్పారనే ఓ న్యూస్ బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు అందర్నీ కలిచివేస్తోంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.