Bigg Boss 8 Telugu Promo: మణికంఠ Vs యష్మీ.. నామినేషన్స్‌లో హీటెక్కించిన ఆర్గ్యూమెంట్స్..
ఈవారం నామినేట్ చేయాలనుకుంటున్న పర్సన్ పేరు, కారణం చెప్పి వాళ్ల తలపై చెత్త పోయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్కరి మధ్య తీవ్రంగా మాటల దాడి జరిగింది. ముందుగా కిర్రాక్ సీత.. యష్మీని నామినేట్ చేస్తూ.. ప్రతి టాస్కులో డామినేట్ చేస్తుందని రీజన్ చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేయగా.. అవతలి టీంను ఎలాగైనా ఓడించాలనే గేమ్ ఆడతాను అంటూ కౌంటరిచ్చాడు.

బిగ్‌బాస్ సీజన్ 8లో రెండు వారాలు పూర్తయ్యాయి. ఇక మూడో వారం నామినేషన్స్ ప్రక్రియ ఈరోజు స్టార్ట్ కానుంది. తాజాగా విడుదలైన ప్రోమోలో కంటెస్టెంట్స్ మధ్య మాటల యుద్ధం నడినట్లు తెలుస్తోంది. గ్రేట్ ఛీఫ్ కావడం వల్ల మొదటి నుంచి నామినేషన్స్ నుంచి తప్పించుకుంటున్న యష్మీ.. ఈసారి నామినేషన్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా మూడో వారం నామినేషన్స్ లో మణికంఠ, యష్మీ మధ్య హీటింగ్ డిస్కషన్ నడిచింది. ఈవారం నామినేట్ చేయాలనుకుంటున్న పర్సన్ పేరు, కారణం చెప్పి వాళ్ల తలపై చెత్త పోయాల్సి ఉంటుంది. దీంతో ఒక్కొక్కరి మధ్య తీవ్రంగా మాటల దాడి జరిగింది. ముందుగా కిర్రాక్ సీత.. యష్మీని నామినేట్ చేస్తూ.. ప్రతి టాస్కులో డామినేట్ చేస్తుందని రీజన్ చెప్పింది. ఇక ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేయగా.. అవతలి టీంను ఎలాగైనా ఓడించాలనే గేమ్ ఆడతాను అంటూ కౌంటరిచ్చాడు.
ఇక తర్వాత యష్మీని నామినేట్ చేస్తూ తన రీజన్స్ చెప్పాడు మణికంఠ. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు.. ఎవరు గిన్నెలు కడగటం లేదు.. ఇలా అన్నీ చూడాలంటూ చెప్పగా.. మాకు లగ్జరీ వచ్చినప్పుడు మా టీంకు వచ్చినప్పుడు మేము కడగక్కర్లేదు అంటూ మధ్యలో మాట్లాడింది యష్మీ. దీంతో మణికంఠ సీరియస్ అయ్యాడు. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ వాయిస్ రెయిజ్ చేశాడు. నువ్వు డ్రామాలు చేస్తావ్ చూడు నా దగ్గరకొచ్చి ఫ్రెండ్ గా అంటూ అనవసరమైన టాపిక్ తీసుకువచ్చింది.
నాకు ఒక పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే నేను రెయిజ్ చేస్తాను.. అంటూ మణికంఠ మాట్లాడితే.. ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసింది యష్మీ. ఇక తర్వాత విష్ణుప్రియ ప్రేరణను నామినేట్ చేసింది. మొత్తానికి మూడో వారం నామినేషన్స్ ఆర్గ్యుమెంట్స్, గొడవలతో హీటెక్కించినట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం యష్మీ, మణికంఠ, అభయ్, ప్రేరణ, పృథ్వీ, కిర్రాక్ సీత నామినేట్ అయినట్లు సమాచారం.
బిగ్‌బాస్ ప్రోమో చూసేయ్యండి..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








