- Telugu News Photo Gallery Cinema photos Do You Remember Karthika Deepam Serial Child Artist Sourya Alias Baby Krithika, Latest Photos Goes Viral
Karthika Deepam: అయ్యా బాబోయ్.. కార్తీక దీపం శౌర్య చాలా మారిపోయిందేంటీ..? ఎంత అందంగా ఉందంటే..
బుల్లితెరపై దాదాపు నాలుగేళ్లపాటు నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయిన సీరియల్ కార్తీక దీపం. సుమారు 1500లకు పైగా ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించింది. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలతోపాటు హిమ, శౌర్య పాత్రలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ఈ సీరియల్లో రౌడీ బేబీగా శౌర్య యాక్టింగ్ అదరగొట్టింది.
Updated on: Sep 14, 2024 | 4:22 PM

బుల్లితెరపై దాదాపు నాలుగేళ్లపాటు నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయిన సీరియల్ కార్తీక దీపం. సుమారు 1500లకు పైగా ఎపిసోడ్లతో ప్రేక్షకులను అలరించింది. ఇందులో వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలతోపాటు హిమ, శౌర్య పాత్రలు కూడా చాలా ఫేమస్ అయ్యాయి.

ఈ సీరియల్లో రౌడీ బేబీగా శౌర్య యాక్టింగ్ అదరగొట్టింది. బాలనటిగా బుల్లితెర ప్రేక్షకులకు తనదైన నటనతో దగ్గరయ్యింది. శౌర్య పాత్రలో కనిపించిన ఆ పాప అసలు పేరు కృతిక. తెలంగాణలో పుట్టి పెరిగిన ఆ చిన్నారి 5 ఏళ్ల వయసు నుంచే నటన స్టార్ట్ చేసింది.

అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కించిన గీతాంజలి సీరియల్ తో బుల్లితెరకు పరిచయమైంది. ఆ తర్వాత పలు సీరియల్స్ చేసిన కృతిక.. కార్తీక దీపం సీరియల్ ద్వారా చాలా ఫేమస్ అయ్యింది. ఇప్పటికీ శౌర్య, రౌడీ బేబీగానే జనాల మనసులలో ఉండిపోయింది.

అంతేకాదు.. రాక్షసి చిత్రంతోపాటు మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాలోనూ కనిపించింది. ప్రస్తుతం సీరియల్స్, సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కృతిక చదువుపై దృష్టి పెట్టింది. ఇటీవలే యూట్యూ్బ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది.

ప్రస్తుతం శౌర్య అలియాస్ కృతిక లేటేస్ట్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో రౌడీ బేబీని చూసి ఆశ్చర్యపోతున్నారు. కార్తీక దీపం సీరియల్లో ఎంతో క్యూట్ గా కనిపించిన కృతిక ఇప్పుడు చాలా అందంగా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.




