Telugu Indian Idol 3:తుది అంకానికి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. లేటెస్ట్ ప్రోమో చూశారా?

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. సుమారు 24 వారాలుగా సాగుతోన్న ఈ సింగింగ్ ట్యాలెంట్ షో గ్రాండ్ ఫినాలేకు సిద్ధమైంది. ఈ సీజన్ కోసం ఏకంగా 37 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించగా 1500 మంది ఔత్సాహిక సింగర్లు పాల్గొన్నారు. వారిలో 100 మందిని సెలెక్ట్ చేసి చివరకు 12 మందిని కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు.

Telugu Indian Idol 3:తుది అంకానికి ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3.. లేటెస్ట్ ప్రోమో చూశారా?
Aha Telugu Indian Idol 3
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2024 | 1:35 PM

ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ప్రతిష్టాత్మక తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 తుది అంకానికి చేరుకుంది. సుమారు 24 వారాలుగా సాగుతోన్న ఈ సింగింగ్ ట్యాలెంట్ షో గ్రాండ్ ఫినాలేకు సిద్ధమైంది. ఈ సీజన్ కోసం ఏకంగా 37 దేశాలలో ఆడిషన్స్ నిర్వహించగా 1500 మంది ఔత్సాహిక సింగర్లు పాల్గొన్నారు. వారిలో 100 మందిని సెలెక్ట్ చేసి చివరకు 12 మందిని కంటెస్టెంట్స్ గా తీసుకున్నారు. వీరిలో నుంచి ఎన్నో ఎలిమినేషన్స్ తర్వాత ఫైనల్ కు ఐదురుగురు సెలెక్ట్ అయ్యారు. అనిరుధ్, కీర్తన, నజీరుద్దీన్, శ్రీకీర్తి, స్కంద తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. తాజాగా ఇండియన్ ఐడల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలను ఆహా వరుసగా రిలీజ్ చేసింది. ఇందులో ఐదుగురు కంటెస్టెంట్స్ క్లాస్, మాస్ పాటలతో ఆకట్టుకున్నారు. ఇక ఇండియన్ ఐడల్ షో జడ్జీలుగా వ్యవహరిస్తున్న తమన్, గీతా మాధురి కూడా అదిరిపోయే పాటలతో అలరించారు. ఇక తాజాగా రిలీజైన ప్రోమోలో నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ కనిపించింది. ‘సెలబ్రేషన్స్ ఆఫ్ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3’ అంటూ ఈ సీజన్ కు సంబంధించిన పలు మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. అలాగే వ్యూస్ పరంగా ఈ సీజన్ సాధించిన ఘనతలు, రికార్డులను అందులో పంచుకున్నారు. అలాగే జడ్జీలు తమన్, గీతా మాధురి, కార్తిక్ ఈ మూడో సీజన్ కు సంబంధించి తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. గత సీజన్లతో పోల్చితే ఈ సీజన్ కంటెస్టెంట్స్ చాలా ట్యాలెంటెడ్ గా ఉన్నారని, వారు అద్భుతంగా పాడారు కాబట్టే ఇండియన్ ఐడల్ సీజన్ 3 గ్రాండ్ సక్సెస్ అయ్యిందని తమన్ యంగ్ సింగర్స్ పై ప్రశంసల వర్షం కురిపించాడు.

కాగా ఈ సీజన్ లో భరత్ రాజ్, కీర్తన, కేశవ్ రామ్, హరి ప్రియ, శ్రీ కీర్తి, నసీరుద్దీన్, స్కంద, దువ్వూరి శ్రీధృతి, రజనీ శ్రీ, సాయి వల్లభ, ఖుషాల్ శర్మ, అనిరుధ్ సుస్వరం ఇలా మొత్తం 12 మంది యంగ్ సింగర్లు అదృష్టం పరీక్షించుకున్నారు. గత 25 ఎపిసోడ్ లలో ఎలిమినేషన్స్ నిర్వహించగా, చివరకు ఐదుగురు ప్రీ ఫినాలేకు చేరుకున్నారు. అనిరుధ్ సుస్వరం, స్కంద, కీర్తన, శ్రీ కీర్తి, నసీరుద్దీన్ ప్ర‌స్తుతం ఇండియన్ ఐడల్ సీజన్ 3 టైటిల్ కోసం పోటీ పడనున్నారు.

లేటెస్ట్ ప్రోమో..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.