AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Demonte Colony 2: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ‘డిమోంటి కాలనీ 2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుళ్ నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అర్చన్ రవీంద్రన్, అంటి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. దాదాపు రూ.15 కోట్లతో నిర్మించిన ఈ మూవీ మొత్తం రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇటు తెలుగులోనూ ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది.

Demonte Colony 2: ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ 'డిమోంటి కాలనీ 2'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Demonte Colony 2
Rajitha Chanti
|

Updated on: Sep 16, 2024 | 5:05 PM

Share

కోలీవుడ్ ఇండస్ట్రీలో ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో సూపర్ హిట్ అయ్యింది ‘డిమోంటి కాలనీ 2’. ఆగస్ట్ 15న థియేటర్లలో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇదే చిత్రాన్ని తెలుగులో ఆగస్ట్ 23న విడుదలై చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు కలెక్షన్స్ పరంగానూ హిట్టయ్యింది. గతంలో 2015లో సూపర్ హిట్ అయిన డిమెంటి కాలనీ చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కించడంతో విడుదలకు ముందే ఈ సినిమాపై ఓ రేంజ్ హైప్ నెలకొంది. ముఖ్యంగా హారర్ మూవీ లవర్స్ ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా వెయిట్ చేశారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అరుళ్ నిథి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో అర్చన్ రవీంద్రన్, అంటి జాస్కేలైనెన్, సెరింగ్ డోర్జీ, అరుణ్ పాండియన్, ముత్తుకుమార్, మీనాక్షి గోవిందరాజన్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఈ సినిమాకు సామ్ సీఎస్ సంగీతం అందించారు. దాదాపు రూ.15 కోట్లతో నిర్మించిన ఈ మూవీ మొత్తం రూ.55 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇటు తెలుగులోనూ ఓ రేంజ్ వసూళ్లు రాబట్టింది.

థియేటర్లలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా డిమెంటి కాలనీ 2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ఇదేనంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ చేయనున్నారట. ఈ విషయాన్ని సెప్టెంబర్ 16న ప్రకటించింది జీ5. తమిళంతోపాటు తెలుగులోనూ అందుబాటులోకి తీసుకురానున్నారట. “చీకటి మళ్లీ వస్తోంది.. ప్రతీకారం కోసం వేచి ఉంది. జీ5లో సెప్టెంబర్ 27 నుంచి తమిళం, తెలుగులో డీమెంటి కాలనీ 2 స్ట్రీమింగ్ అవుతుంది” అంటూ రాసుకొచ్చింది.

కథ విషయానికి వస్తే.. క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది డెబీ (ప్రియ భవానీ శంకర్). అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ అంతలోనే సామ్ ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో తన భర్త సూసైడ్ చేసుకోవడానికి గల కారణం తెలియక డెబీ సతమతమవుతుంది. ఓ బౌద్ధ సన్యాసి (త్సెరింగ్ దోర్జీ) సాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే సామ్ సూసైడ్ చేసుకోవడానికి గల రీజన్ తెలుస్తోంది. సామ్ చదివిన ఓ పుస్తకమే అతడి చావుకు కారణమని.. అంతకుముందు కొందరు అలాగే చనిపోయారని తెలుసుకుంటుంది. ఆ పుస్తకం చదివిన మరికొందరి చావులను చెక్ పెట్టేందుకు తన మామ రిచర్డ్ (అరుణ్ పాండియన్) తోపాటు సోదరుడితో కలిసి ప్రణాళిక రచిస్తుంది. చివరకు డెబీ ప్రయత్నం ఫలించిందా ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
మేషం నుంచి మీనం వరకు.. సోమవారం ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు?
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
'నాలో వారికి ఏం నచ్చిందో తెలియదు' బిచ్చగాడికి 21 మంది భార్యలు!
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. సోమవారం తగ్గిన ధరలు..
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన