Tollywood: ఈ సర్కిల్‌లోని చిన్నారి 13 ఏళ్లకే హీరోయిన్ అయ్యింది.. 50 ఏళ్లు దాటినా తరగని అందం.. గుర్తు పట్టారా?

పై ఫొటోలోని సర్కిల్‌లో సోడా బుడ్డి కళ్లద్దాలతో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఫేమస్ నటి. తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 13 ఏళ్లకే నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె తన స్టార్ డమ్ తో స్టార్ హీరోలకు సైతం చుక్కలు చూపించింది

Tollywood: ఈ సర్కిల్‌లోని చిన్నారి 13 ఏళ్లకే హీరోయిన్ అయ్యింది.. 50 ఏళ్లు దాటినా తరగని అందం.. గుర్తు పట్టారా?
Tollywood Actress Childhood Photo
Follow us
Basha Shek

|

Updated on: Sep 15, 2024 | 12:01 PM

పై ఫొటోలోని సర్కిల్‌లో సోడా బుడ్డి కళ్లద్దాలతో కనిపిస్తున్న చిన్నారి ఎవరో తెలుసా? ఆమె ఇప్పుడు భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఫేమస్ నటి. తన అందం, అభినయంతో దేశ వ్యాప్తంగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. 13 ఏళ్లకే నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఆమె తన స్టార్ డమ్ తో స్టార్ హీరోలకు సైతం చుక్కలు చూపించింది. మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, రజనీకాంత్.. ఇలా ఎందరో స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. స్టార్ హీరోయిన్ గా కొన్నేళ్ల పాటు సినిమా ఇండస్ట్రీని శాసించింది. పెళ్లి, పిల్లల తర్వాత కూడా తన వయసుకు తగ్గ పాత్రల్లో నటిస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ప్రస్తుతం దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో పవర్ ఫుల్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన ఆమె మరెవరో కాదు రమ్యకృష్ణ. ఆదివారం (సెప్టెంబర్ 15) ఆమె పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అదే సమయంలో రమ్యకృష్ణ చిన్ననాటి ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రమ్య 13 ఏళ్ల వయసులో నటించడం ప్రారంభించింది. 1983లో విడుదలైన ‘వెల్లై మిందానా’ ఆమె మొదటి సినిమా. వై.జి.మహేంద్రన్‌తో కలిసి స్క్రీన్‌ను పంచుకున్నారు. ఈ ఫోటోలో రమ్యకృష్ణ చదువుకునే రోజుల్లో తీసిన ఫోటో. రమ్యకృష్ణ కు సినీ పరిశ్రమతో నాలుగు దశాబ్దాలు అనుబంధం ఉంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో ఆమె సుమారుగా 250 సినిమాల్లో నటించింది. ఈ మధ్య కాలంలో సపోర్టింగ్ రోల్స్ లో మెరుస్తోందీ అందాల తార. హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఆమె ప్రభాస్ నటించిన ‘బాహుబలి’ సినిమాలో రాజ మాత శివగామి దేవి పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ సినిమా ఆమె క్రేజ్‌ ను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లింది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా 6 కోట్ల పారితోషికం తీసుకున్నారట. ఇక గతేడాది రంగ మార్తాండ సినిమాలో అద్భుతంగా నటించిన రమ్యకృష్ణ, ఈ ఏడాది రాజ్ తరుణ్ తో కలిసి పురుషోత్తముడు సినిమాలో సందడి చేసింది.

నటి రమ్య కృష్ణ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.