AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: ‘దేవుడిపై భక్తి లేదు’.. వినాయక చవితి ఉత్సవాలపై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్

ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. పేద పిల్లలకు, జంతువులకు తన వంతు సహాయం చేస్తుంటుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన అభిమానులు, ఫాలోవర్లను కూడా సోషల్ మీడియా వేదికా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై తన గళం వినిపిస్తుంటుంది.

Renu Desai: 'దేవుడిపై భక్తి లేదు'.. వినాయక చవితి ఉత్సవాలపై రేణూ దేశాయ్ షాకింగ్ కామెంట్స్
Renu Desai
Basha Shek
|

Updated on: Sep 16, 2024 | 2:09 PM

Share

ప్రముఖ నటి, దర్శకురాలు రేణు దేశాయ్ కు సామాజిక స్పృహ ఎక్కువ. పేద పిల్లలకు, జంతువులకు తన వంతు సహాయం చేస్తుంటుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటు తన అభిమానులు, ఫాలోవర్లను కూడా సోషల్ మీడియా వేదికా విరాళాలు అడుగుతూ ఉంటుంది. అలాగే సోషల్ సామాజిక అంశాలపై తరచూ స్పందిస్తుంటుంది. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల సమస్యలపై తన గళం వినిపిస్తుంటుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ వైరల్ గా మారింది. వినాయక చవితి ఉత్సవాలపై స్పందించిన ఆమె ‘ ఇప్పుడు అందరూ కూడా తమ స్థాయిని చాటుకోవడం కోసం.. పెద్ద పెద్ద విగ్రహాలు, ఎక్కువ డెకరేషన్ అంటూ సెలబ్రేషన్స్ చేస్తున్నారు. నిజానికి అందులో దేవుడు లేడు.. మనిషి దురాశ.. అత్యాశ మాత్రమే ఉంది’ అని రేణూ దేశాయ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. కాగా వినాయక చవితి సందర్భంగా చాలా చోట్ల వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించారు. అయితే కొన్ని చోట్ల దేవుడి స్థాయిని దిగజార్చేలా హీరోలు, హీరోయిన్ల గెటప్పుల్లో వినాయకుడి విగ్రహాలను పెట్టడమే రేణూ దేశాయ్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. అలాగే దేవుడిపై ఏ మాత్రం భక్తి లేకుండా గణపతి దేవుడి విగ్రహాలను ఇష్టమొచ్చినట్లు నిమజ్ఞనం చేయడంపై ఆమె కోపానికి కారణమని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా సింగిల్ మదర్ గానే లైఫ్ ను లీడ్ చేస్తోన్న రేణూ దేశాయ్ తన పిల్లలు ఆద్య, అఖిరా నందన్ ల బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె ‘టైగర్ నాగేశ్వరావు’ మూవీతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. ఇందులో ఆమె పోషించిన హేమలతా లవణం పాత్రకు మంచి ప్రశంసలు వచ్చాయి. దీంతో రేణూ మళ్లీ సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు. కానీ అదేమీ జరగలేదు.

రేణూ దేశాయ్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

renu desai (@renuudesai) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

భారీ వరదల బారి నుంచి గోవులను రక్షించే కార్యక్రమంలో రేణూ దేశాయ్.. వీడియో ఇదిగో..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

renu desai (@renuudesai) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
హైదరాబాద్‌లో ట్రంప్ టవర్స్.. ఎన్ని వేల కోట్లతో నిర్మిస్తున్నారంటే
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
తొలి టెస్టుతోనే కెరీర్ క్లోజ్.. ఈ 5గురి స్టోరీ తెలిస్తే షాకే..!
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు చేయొద్దు.. గ్రహణం తర్వాత తప్పక ఇలా..
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
బుక్ చేసిన 45 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్.. సేవలు ప్రారంభం
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
కూతురిపై అఘాయిత్యానికి తల్లి సపోర్ట్..!
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే?
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
చుక్కల అమావాస్య.. ఈరోజు ఒక్క దీపం వెలిగిస్తే ఇంట్లో చీకట్లు తొలగి
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..
ఓటీటీలో రచ్చ చేస్తున్న హారర్ సినిమా..