Raghava Lawrence: వరస ప్లాప్స్ ఎఫెక్ట్.. వరుస సినిమాలకు కమిట్ అవుతున్న లారెన్స్.!
వరుస ఫెయిల్యూర్స్ తరువాత షార్ట్ బ్రేక్ ఇచ్చిన లారెన్స్ ఇప్పుడు స్పీడు పెంచారు. వరుస సినిమాలు కమిట్ అవుతూ జోరు చూపిస్తున్నారు. హిట్ ఫార్ములాను రిపీట్ చేయటంతో పాటు కొత్త జానర్స్ కూడా ట్రై చేస్తున్నారు. కాంచన సిరీస్‌లో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన లారెన్స్, ఈ మధ్య సక్సెస్ విషయంలో తడబడుతున్నారు. లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన రుద్రన్, చంద్రముఖి 2, జిగర్తాండ డబుల్ఎక్స్ ఫెయిల్ అవ్వటంతో షార్ట్ బ్రేక్ తీసుకున్నారు.