- Telugu News Photo Gallery Cinema photos Icon Star Allu Arjun Next Movie with Director Trivikram, atlee and sandeep reddy vanga Telugu Heroes Photos
Allu Arjun: అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి.? ఎందుకు ఇంత రచ్చ.. ఫ్యాన్స్ కన్ఫ్యూజన్
అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి.. దీనిపై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. సమాధానమే దొరకట్లేదు. ఓ సారి అట్లీ అంటారు.. ఇంకోసారి త్రివిక్రమ్ అంటారు.. మరోసారి పుష్ప 3 అంటారు. ఇందులో ఏది నిజమో అనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో పెరిగిపోయింది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. మరి ఆ క్లారిటీ ఏంటి.? పుష్ప 2 అయ్యే వరకు అల్లు అర్జున్ ఫోకస్ మరో సినిమా వైపు వెళ్లేలా కనిపించట్లేదు.
Updated on: Sep 18, 2024 | 10:00 PM

అల్లు అర్జున్ నెక్ట్స్ సినిమా ఏంటి.. దీనిపై చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. సమాధానమే దొరకట్లేదు. ఓ సారి అట్లీ అంటారు.. ఇంకోసారి త్రివిక్రమ్ అంటారు.. మరోసారి పుష్ప 3 అంటారు.

ఇందులో ఏది నిజమో అనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో పెరిగిపోయింది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. మరి ఆ క్లారిటీ ఏంటి..?

పుష్ప 2 అయ్యే వరకు అల్లు అర్జున్ ఫోకస్ మరో సినిమా వైపు వెళ్లేలా కనిపించట్లేదు. ఇండియాలో నెక్ట్స్ 1000 కోట్ల సినిమా ఇదే అంటూ పుష్ప 2పై అంచనాలు పెంచేస్తున్నారంతా.

సౌత్ కంటే నార్త్‌లోనే దీనిపై ఎక్స్‌పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుష్ప 2 వచ్చాకే.. నెక్ట్స్ ఏం చేద్దాం అనేది డిసైడ్ చేసుకోనున్నారు బన్నీ. డిసెంబర్ 6న పుష్ప 2 విడుదల కానుంది.

జగపతిబాబు, ఫాహద్ ఫాజిల్.. ఇలా ప్రతి ఒక్కరి గురించీ డిస్కస్ చేసుకుంటున్నారు అభిమానులు. డిసెంబర్ 5న రిలీజ్‌కి రెడీ అవుతున్న పుష్ప ది రూల్‌ని చూడటానికి ప్యాన్ ఇండియా రేంజ్‌లో ఎంత మంది వెయిట్ చేస్తున్నారో చెప్పకనే చెప్పింది ట్రైలర్ లాంచ్ ఈవెంట్.

పుష్ప 3 అంటూ సుకుమార్ కూడా ఆసక్తి పెంచేస్తున్నారు. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా త్రివిక్రమ్‌తోనే అని తెలుస్తుంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో భారీ పాన్ ఇండియన్ సినిమాకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

దీని తర్వాత అట్లీ ప్రాజెక్ట్ ఉండే ఛాన్స్ ఉంది. గీతా ఆర్ట్స్, టి సిరీస్ ఈ సినిమాను నిర్మించబోతున్నాయి. మరోవైపు పుష్ప 3 ఉండే అవకాశం కూడా కొట్టి పారేయలేం. ఏదేమైనా ఒక్కటైతే కన్ఫర్మ్.. పుష్ప 2 తర్వాత బన్నీ చేయబోయే సినిమా మాత్రం త్రివిక్రమ్‌తోనే.




