- Telugu News Photo Gallery Cinema photos Nandamuri Balakrishna and Boyapati Srinu Akhanda 2 Movie Shooting Update on September 2024 Telugu Heroes Photos
Balakrishna – Akhanda 2: అఖండ 2 కి అంత రెడీ అంటున్న బోయపాటి.. బాలయ్యే లేటు చేస్తున్నారా.?
ఇక మన ఊపు మామూలుగా ఉండదు. రిలీజ్‌కి ఓ సినిమా.. మొదలై ఓ సినిమా.. మొదలు కావడానికి ఇంకో సినిమా.. జోష్ డబుల్ ట్రిపుల్ అవుతుందని అంటున్నారు నందమూరి బాలకృష్ణ. ఈ ఏడాది ఎండింగ్‌లో స్వీట్ సర్‌ప్రైజ్ రెడీగా ఉందంటూ ఊరిస్తున్నారు. ఇంతకీ నందమూరి అందగాడు చెబుతున్న సంగతేంటి.? భగవంత్ కేసరి తర్వాత ఇప్పటిదాకా మరే సినిమా రిలీజ్ చేయలేదు నందమూరి బాలకృష్ణ.
Updated on: Sep 19, 2024 | 7:34 PM

చాలా రోజుల నుంచి నందమూరి అభిమానులు వేచి చూస్తున్న రోజు రానే వచ్చేసింది. అఖండ 2పై అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

డివైన్ టచ్ ఉన్న మన కంటెంట్‌కి నార్త్ లో ఇప్పుడు యమా క్రేజ్ ఉంది. అఖండ2లో ఆధ్యాత్మిక టచ్ బాగానే ఉంది. ఈ పాజిటివ్ వైబ్ బోయపాటికి విజిటింగ్ కార్డులా ఉపయోగపడుతుందా?

భగవంత్ కేసరి తర్వాత ఇప్పటిదాకా మరే సినిమా రిలీజ్ చేయలేదు నందమూరి బాలకృష్ణ. ఓ వైపు ఎలక్షన్లు, ఇంకోవైపు షూటింగులతో బిజీ బిజీగా గడిపేశారు.

బాలయ్య స్పీడ్ చూస్తుంటే కుర్ర హీరోలకు కూడా కుళ్లు వచ్చేస్తుంది. అసలు అదేం స్పీడ్ అండీ బాబూ.. ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరోవైపు ఒప్పుకున్న సినిమాలను కూడా ఎడాపెడా పూర్తి చేస్తున్నారు.

డాకు మహరాజ్ టైటిల్‌ని మాత్రమే అనౌన్స్ చేస్తారనుకుంటే అంతకు మించిన అప్‌డేట్స్ తో కిక్ ఇచ్చేశారు బాలయ్య.

ప్యాన్ ఇండియా ఎంట్రన్స్ లో ఆయన డిస్టింక్షన్‌లో పాస్ అవుతారా అనేది ఫిల్మ్ నగర్‌లో డిస్కస్ అవుతున్న పాయింట్.

ఫస్ట్ షెడ్యూల్‌లో కీలక పాత్రధారులందరితోనూ కీ సీక్వెన్స్ ప్లాన్ చేశారట బోయపాటి. ఫస్ట్ పార్ట్ ని మించేలా సెకండ్ పార్టు ఉండేలా స్క్రిప్ట్ ని అద్భుతంగా డీల్ చేశారట.




