- Telugu News Photo Gallery Cinema photos Nayanthara Celebrate his husband Vignesh Shivan Birthday With Romantic Dinner, See Photos
Nayanthara: భర్త పుట్టిన రోజు.. విఘ్నేశ్ శివన్‌ను ముద్దులతో ముంచెత్తిన నయన తార.. రొమాంటిక్ ఫొటోస్ వైరల్
దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నయన తార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తాజాగా తన భర్త పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నయన్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Updated on: Sep 18, 2024 | 3:48 PM

దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లో నయన తార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు. తాజాగా తన భర్త పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది నయన్. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బుధవారం (సెప్టెంబర్ 18) విఘ్నేష్ శివన్ పుట్టినరోజు. అయితే ఒకరోజు ముందు అంటే సెప్టెంబర్ 17వ తేదీ రాత్రి నయనతార తన భర్త బర్త్ డేను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసింది.

బర్త్ డే వేడుకల్లో భాగంగా అర్ధరాత్రి భర్తతో కలిసి రొమాంటిక్ డిన్నర్ ను ఏర్పాటు చేసిందీ అందాల తార. ఈ సందర్భంగా తన భర్తను ముద్దులతో ముంచెత్తిందీ ముద్దుగుమ్మ.

కాగా నయనతార ప్రస్తుతం చాలా సినిమాలతో బిజీగా ఉంది. అయితే మధ్యమధ్యలో కుటుంబానికి సమయం కేటాయిస్తోంది. ఇందులో భాగంగానే ఆమె తన భర్త పుట్టినరోజు సందర్భంగా రెస్టారెంట్ లో విఘ్నేష్‌తో కలిసి భోజనం చేసింది.

నయనతార, విఘ్నేష్ శివన్‌ల వివాహం2022 జూన్ 9న జరిగింది. అయితే 2022 అక్టోబర్‌లో సరోగసీ ద్వారా ఉయిర్, ఉలగ్ అనే కవల పిల్లలకి అమ్మానాన్నలయ్యారీ లవ్లీ కపుల్.