AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 8 Telugu: హౌస్‌లో ఉన్నది రెండు వారాలే.. అయినా భారీగానే శేఖర్‌ బాషా రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలంటే?

మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ ఊహించినదే అయినా రెండో వారం మాత్రం షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చాలా వారాలు హౌస్ లో ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ బాషా ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్‌బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ బాషా పాలిట శాపంగా మారింది.

Bigg Boss 8 Telugu: హౌస్‌లో ఉన్నది రెండు వారాలే.. అయినా భారీగానే శేఖర్‌ బాషా రెమ్యునరేషన్.. ఎన్ని లక్షలంటే?
Bigg Boss Contestant Shekar Basha
Basha Shek
|

Updated on: Sep 16, 2024 | 10:43 AM

Share

బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ రెండో వారం కూడా గడిచిపోయింది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి అడుగు పెడితే ఇద్దరు ఇప్పటికే బయటకు వెళ్లిపోయారు. మొదటి వారం బెజవాడ బేబక్క ఎలిమినేషన్ ఊహించినదే అయినా రెండో వారం మాత్రం షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. చాలా వారాలు హౌస్ లో ఉంటాడనుకున్న ఆర్జే శేఖర్ బాషా ఊహించని విధంగా ఎలిమినేట్ అయిపోయాడు. బిగ్‌బాస్ తీసుకొచ్చిన కొత్త రూల్ శేఖర్ బాషా పాలిట శాపంగా మారింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఆఖరి రెండు స్థానాల్లో ఆదిత్య ఓం, శేఖర్ బాషా నిలిచారు. అయితే బిగ్ బాస్ హౌసులో ఎవరు ఉండాలి? ఎవరు ఎలిమినేట్ అవ్వాలనేది ఆడియెన్స్ కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. దీంతో కిర్రాక్ సీత తప్పితే మిగతా కంటెస్టెంట్స్ అందరూ కట్ట కట్టుకుని మరీ శేఖర్ బాషా హౌస్ నుంచి వెళ్లిపోవాలని తీర్మానించేశారు. మొత్తానికి తన కామెడీ పంచులు, ప్రాసలతో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేస్తోన్ శేకర్ బాషా ఎలిమినేట్ అవ్వడం ఆడియెన్స్‌ను షాక్ కు గురి చేసింది. కాగా హౌస్ లో ఉన్నది రెండు వారాలే అయినప్పటికీ శేఖర్ బాషాకు భారీగానే రెమ్యునరేషన్ అందినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కాగా బిగ్ బాస్ వర్గాల సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ కోసం శేఖర్ బాషా రోజుకు రూ. 35 వేల చొప్పున వారానికి రూ. 2.50 లక్షలు పారి తోషకం తీసుకున్నాడని తెలుస్తోంది. అలా 2 వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న బాషా మొత్తంగా రూ. 5 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఊహించని విధంగా ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా మరోసారి బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. మరో మూడు వారాల్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నాయి. అప్పుడు అతను కూడా మళ్లీ హౌస్ లోకి అడుగు పెట్టనున్నాడని టాక్ వినిపిస్తోంది. కాగా రీసెంట్ గా తండ్రిగా ప్రమోషన్ పొందాడు శేఖర్. అతని భార్య పండంటి మగ బిడ్డను ప్రసవించింది. మరి కుమారుడి అలనా పాలనా చూసుకుంటాడో, బిగ్ బాస్ హౌస్ లోకి వస్తాడో మరి కొన్ని రోజుల్లో తెలియనుంది.

కంటెస్టెంట్స్ అందరూ కట్ట కట్టి పంపించేశారు..

బిగ్ బాస్ బజ్ లో  శేఖర్ బాషా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!