Bigg Boss 8 Telugu: బిగ్‌ బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. ఓటింగ్‌లో ముందున్నా బయటకు శేఖర్ బాషా.. కారణమిదే

మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు వెళ్లిపోయింది. ఇది చాలా మంది ఊహించినదే అయినా రెండో వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ హౌస్‍లో ఇతరుల కంటే కంటే కాస్తో కూస్తో ఎంటర్‌టైన్‍మెంట్, ఫన్ అందిస్తోన్న ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం (సెప్టెంబర్ 15) నాటి ఎపిసోడ్ లో శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.

Bigg Boss 8 Telugu: బిగ్‌ బాస్‌లో షాకింగ్ ఎలిమినేషన్.. ఓటింగ్‌లో ముందున్నా బయటకు శేఖర్ బాషా.. కారణమిదే
Shekar Basha
Follow us
Basha Shek

|

Updated on: Sep 16, 2024 | 6:45 AM

బిగ్‍‍బాస్ తెలుగు 8వ సీజన్ రసవత్తరంగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ఈ రియాలిటీ షో రెండో వీక్ కూడా కంప్లీట్ అయ్యింది. మొదటి వారం బెజవాడ బేబక్క బయటకు వెళ్లిపోయింది. ఇది చాలా మంది ఊహించినదే అయినా రెండో వారం మాత్రం షాకింగ్ ఎలిమినేషన్ జరిగింది. బిగ్ బాస్ హౌస్‍లో ఇతరుల కంటే కంటే కాస్తో కూస్తో ఎంటర్‌టైన్‍మెంట్, ఫన్ అందిస్తోన్న ఆర్జే శేఖర్ బాషా ఎలిమినేట్ కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆదివారం (సెప్టెంబర్ 15) నాటి ఎపిసోడ్ లో శేఖర్ బాషా ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. దీంతో బిగ్ బాస్ ఆడియెన్స్ షాక్ కు గురయ్యారు. నామినేషన్స్ లో ఉన్న తోటి కంటెస్టెంట్స్ కంటే ఓటింగ్‍లో శేఖర్ బాషా టాప్‍లో ఉన్నాడు. అయితే అతను ఎలిమినేట్ అయ్యేందుకు ఓ బలమైన కారణం ఉంది. రెండో వారం ఎలిమినేషన్ కోసం మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. పృథ్విరాజ్, నాగ మణికంఠ, ఆదిత్య ఓం, నిఖిల్, కిర్రాక్ సీత, శేఖర్ బాషా, నైనిక, విష్ణుప్రియ నామినేట్ అయ్యారు. తక్కువ ఓట్లు పోలైన ఆదిత్య, సీతలో ఒకరు ఎలిమినేట్ అవుతారని చాలా మంది భావించారు. అయితే, సడెన్‍గా శేఖర్ బాషా హౌస్ నుంచి బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఓటింగ్ పరంగా చూస్తే శేఖర్ బాషానే చాలా ముందు ఉన్నాడు. కానీ అతను తండ్రి అయ్యాడు. అతని భార్య పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.

ఇవి కూడా చదవండి

శేఖర్ బాషా తండ్రైన విషయాన్ని శనివారం నాటి ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జునే వెల్లడించాడు. ఇక ఆదివారం నాటి ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. నామినేషన్లలో ఉన్న మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ లో చివరకు ఆదిత్య ఓం, శేఖర్‌ బాషా మిగిలారు. ఈ ఇద్దరిలో ఎవరు హౌస్‌లో ఉండేందుకు అర్హులో వాళ్ల మెడలో పూలదండ వేయమని నాగార్జున కంటెస్టెంట్స్ కు సూచించారు. దీంతో గత వారం రోజుల నుంచి శేఖర్‌బాషా ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని, కొడుకు పుట్టాడని సమాచారం తెలిసిన తర్వాత మరింత భావోద్వేగానికి గురవుతున్నారని హౌస్ మేట్స్ ఎక్కువ మంది ఆదిత్య ఓం మెడలో పూలదండ వేశారు.

హౌస్ మేట్స్ అందరూ ఆదిత్య కే సపోర్టుగా..

ఒక్క కిర్రాక్‌ సీత మాత్రమే శేఖర్‌బాష మెడలో మాల వేసింది. దీంతో శేఖర్‌ బాషా ఎలిమినేట్‌ అయినట్లు నాగార్జున ప్రకటించారు. తన కామెడీ పంచులు, ప్రాసలతో హౌస్ లో ఎంటర్ టైన్మెంట్ అందిస్తోన్న శేఖర్ బాషా అనూహ్యంగా ఎలిమినేట్ కావడం అభిమానులను తీవ్రంగా నిరాశపర్చింది.

బిగ్ బాస్ బజ్ లో  శేఖర్ బాషా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.