Syed Sohel: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరో.. ఏమైందంటే?

సోహైల్ కు తండ్రి సయ్యద్ సలీం, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. కాగా ఫైమా సుల్తానా గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. డయాలసిస్ కోసం ఆమెను హైదరాబాద్ లోని మెడి కవర్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే మంగళవారం ఫైమా పరిస్థితి పూర్తిగా విషమించి కన్నుమూసిందని తెలుస్తోంది.

Syed Sohel: బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న హీరో.. ఏమైందంటే?
Syed Sohel
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2024 | 4:52 PM

ప్రముఖ సినీ నటుడు, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సయ్యద్ సోహైల్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని తల్లి ఫైమా సుల్తానా మంగళవారం (సెప్టెంబర్ 17) మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోన్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో సొహైల్‌తో పాటు అతని కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సోహైల్ కు ధైర్యం చెబుతున్నారు. అతని తల్లి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. ప్రార్థిస్తున్నారు. కాగా సోహైల్ స్వస్థలం తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం. దీంతో తల్లి పార్థివ దేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కరీనంగర్ కే తరలించారు. సోహైల్ కు తండ్రి సయ్యద్ సలీం, తమ్ముడు సయ్యద్ నబీల్ ఉన్నారు. కాగా ఫైమా సుల్తానా గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతోంది. డయాలసిస్ కోసం ఆమెను హైదరాబాద్ లోని మెడి కవర్ ఆస్పత్రిలో చేర్పించారు కుటుంబ సభ్యులు. అయితే మంగళవారం ఫైమా పరిస్థితి పూర్తిగా విషమించి కన్నుమూసిందని తెలుస్తోంది.

కాగా సోహెల్ కెరీర్ విషయానికొస్తే వరుణ్ సందేశ్ మొదటి సినిమా ‘కొత్తబంగారు లోకం’ తోనే ఇతను కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఈ సినిమాలో అతనిది కనీకనిపించని పాత్ర . ఆ తర్వాత ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజ్’ తదితర సినిమాల్లో సైడ్ ఆర్టిస్టుగా నటించాడు. సోషల్ మీడియాలో బాగా క్రేజ్ రావడంతో బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

తండ్రితో హీరో సోహైల్..

ఆ తర్వాత హీరోగా కూడా మారిపోయాడు. లక్కీ లక్ష్మణ్, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, మిస్టర్ ప్రెగ్నెంట్, బూట్ కట్ బాలరాజు వంటి సినిమాలలో హీరోగా నటించాడు సోహైల్. కథల పరంగా సినిమాల సెలెక్షన్స్ బాగున్నా ఇవేవీ కమర్షియల్ గా వర్కవుట్ కాలేదు. దీంతో ఒకానొక టైమ్ లో తన సినిమాను చూడమని వేడుకుంటూ బహిరంగంగానే కన్నీళ్ళు పెట్టుకున్నాడు సొహైల్.

మెగాస్టార్ చిరంజీవితో సోహైల్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.