Squid Game: స్క్విడ్ గేమ్.. హిందీ చిత్రం “లక్”కు కాపీనా ??
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై బాగా పాపులరైన వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’, తన చిత్రాన్ని కాపీ కొట్టి దీనిని తెరకెక్కించారంటూ తాజాగా ఓ బాలీవుడ్ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు. తన సినిమా కథ.. ఈ సిరీస్‌లో చూపించిన కథ ఒకటేనని.. తనకు నష్టపరిహారం అందించాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్, సిరీస్ రచయిత హ్వాంగ్ డాంగ్ హ్యుక్‌పై దావా వేశాడు.
నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై బాగా పాపులరైన వెబ్ సిరీస్ ‘స్క్విడ్ గేమ్’, తన చిత్రాన్ని కాపీ కొట్టి దీనిని తెరకెక్కించారంటూ తాజాగా ఓ బాలీవుడ్ దర్శకుడు కోర్టును ఆశ్రయించాడు. తన సినిమా కథ.. ఈ సిరీస్‌లో చూపించిన కథ ఒకటేనని.. తనకు నష్టపరిహారం అందించాలని కోరుతూ నెట్‌ఫ్లిక్స్, సిరీస్ రచయిత హ్వాంగ్ డాంగ్ హ్యుక్‌పై దావా వేశాడు. బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘లక్’ . మిథున్ చక్రవర్తి, సంజయ్ దత్, ఇమ్రాన్ ఖాన్ కీలకపాత్రలు పోషించారు. శ్రుతిహాసన్ ఈ చిత్రంతోనే నటిగా తొలి అడుగు వేసింది. 2009లో విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్‌కే పరిమితమైంది. ఈ చిత్రాన్ని కాపీ కొట్టి ‘స్క్విడ్ గేమ్’ రూపొందించారని సోహమ్ షా తాజాగా న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించాడు. ఇది పూర్తిగా కాపీ రైట్ ఉల్లంఘన కిందకు వస్తుందని అన్నాడు. స్ట్రీమింగ్ నుంచి నెట్‌ఫ్లిక్స్ దీనిని తొలగించాలని కోరాడు. మరోవైపు, దర్శకుడి ఆరోపణలపై నెట్‌ఫ్లిక్స్ స్పందించింది. ఆయనవి కేవలం ఆరోపణలు మాత్రమేనని.. అందులో ఎలాంటి నిజానిజాల్లేవని పేర్కొంది. ఈ కథను రాసింది, దర్శకత్వం వహించింది హ్వాంగ్ డాంగ్ హ్యుక్ మాత్రమేనని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాలివానకు కుప్పకూలిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ
మన కొల్హాపురి చెప్పులకు రూ. 85 వేలా?
వరుడి గొంతెమ్మ కోరిక..పెళ్లిలో వధువు దిమ్మతిరిగే ట్విస్ట్
హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. పెనుముప్పు తప్పదా ??
మెస్సీ ప్రైవేట్ జెట్ చూసారా ?? గాల్లో ఎగిరే ప్యాలెస్!
మెస్సీతో సెల్ఫీ బదులు.. కార్పెట్ ఇంటికి తీసుకెళ్లిన ఫ్యాన్
చనిపోయిన తరువాత కూడా.. తండ్రి కల నెరవేర్చిన కొడుకు

