Bigg Boss 8 Telugu: ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం.. బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం!

మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెట్టగా, బేబక్క, శేఖర్ భాషా ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 12 కంటెస్టెంట్స్ ఎవరికి వారు హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన ప్రేరణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని సమాచారం.

Bigg Boss 8 Telugu: ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం.. బిగ్ బాస్ షాకింగ్ నిర్ణయం!
Prerana Kambam
Follow us
Basha Shek

|

Updated on: Sep 17, 2024 | 6:21 PM

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రసవత్తరంగా సాగుతోంది. గత సీజన్లలా ఈసారి ఆకట్టుకునే కంటెస్టెంట్స్ లేకపోయినా కొందరి ఆట, మాట తీరుతో బుల్లితెర ఆడియెన్స్ కు ఓ మోస్తరుగా ఎంటర్ టైన్మెంట్ దొరుకుతోంది. సెప్టెంబర్ 1న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు కొత్త సీజన్ ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకుంది. మొత్తం 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగు పెట్టగా, బేబక్క, శేఖర్ భాషా ఇప్పటికే ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం 12 కంటెస్టెంట్స్ ఎవరికి వారు హైలైట్ అయ్యే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే ఈసారి హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లో ఒకరైన ప్రేరణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుందని సమాచారం. ప్రేరణ భర్త వాళ్ల అమ్మమ్మ తాజాగా కన్నుమూసినట్టు తెలుస్తోంది. అయితే ప్రేరణ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఉంది కాబట్టి ఈ విషాదం గురించి తెలిసే అవకాశం లేదు. అయితే అది మంగళవారం ఎపిసోడ్ లో బిగ్ బాస్ స్వయంగా ప్రేరణకు చెప్పనున్నాడని సమచారం. మరి ఈ విషయం తెలిస్తే ప్రేరణ ఎలా రిసీవ్ చేసుకుంటుందోనని ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపిస్తాడా? లేదా అలాగే హౌస్ లో కంటిన్యూ అయ్యి గేమ్ ను కొనసాగిస్తుందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.

కాగా ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ లో ప్రేరణ కూడా ఒకరు. ఒక వేళ ప్రేరణ అర్ధాంతరంగా హౌస్ నుంచి బయటకు వెళ్లిపోతే మాత్రం అది ఆమెతో పాటు ఆమె అభిమానులకు కూడా తీవ్ర నిరాశను కలిగిస్తుంది. అదే సమయంలో ఫ్యామిలీకి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలని అభిమానులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ లిస్టులో ప్రేరణ కూడా..

మరి ఈ విషయంలో ప్రేరణ, బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాలంటే బిగ్ బాస్ డే 16 ఎపిసోడ్ చూడాల్సిందే. కాగా ప్రేరణ కొన్ని నెలల క్రితమే పెళ్లి చేసుకుంది. పేరుకే కన్నడ అమ్మాయి గానీ తెలుగు సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇదే క్రేజ్ తో బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ గా అడుగు పెట్టింది.

బిగ్ బాస్ హౌస్ లో ప్రేరణ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.