Ananya Nagalla: ‘సీఎం చంద్రబాబును కలిశాను..చాలా సంతోషంగా ఉంది’.. వరద బాధితులకు సాయం చేసిన ఏకైక హీరోయిన్

వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి .అదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు

Ananya Nagalla: 'సీఎం చంద్రబాబును కలిశాను..చాలా సంతోషంగా ఉంది'.. వరద బాధితులకు సాయం చేసిన ఏకైక హీరోయిన్
CM Chandrababu Naidu, Ananya Nagalla
Follow us
Basha Shek

|

Updated on: Sep 18, 2024 | 3:17 PM

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీ, తెలంగాణలో చాలా ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో ఖమ్మం, ఆంధ్రప్రదేశ్ లోని విజయ వాడ ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాడు. లక్షలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు.  వరద బాధితులను ఆదుకునేందుకు ఇరు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి .అదే సమయంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కూడా వరద బాధితులకు అండగా నిలిచారు. రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు తమ వంతుగా విరాళాలు ప్రకటించారు. ఇక టాలీవుడ్ నుంచి కూడా పలువురు సినీ ప్రముఖులు వరద బాధితుల కోసం భారీగా విరాళాలు ప్రకటించారు. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, బాలకృష్ణ, నాగార్జున, విక్టరీ వెంకటేశ్, సిద్దూ జొన్నల గడ్డ, విశ్వక్ సేన్.. తదితరులు ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్స్ కు విరాళాలు ప్రకటించారు. ఇప్పుడు వీరు ముఖ్యమంత్రులను కలిసి తాము ప్రకటించిన విరాళాలను చెక్ రూపంలో అందజేస్తున్నారు. కాగా మన తెలుగమ్మాయి, నటి అనన్య నాగళ్ల రెండు తెలుగు రాష్ట్రాలకు 2.5 లక్షల చొప్పున మొత్తం 5 లక్షల రూపాయలు వరద బాధితులకు విరాళంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం (సెప్టెంబర్ 18) ఉదయం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసిన అనన్య నాగళ్ళ 2.5 లక్షల రూపాయల చెక్కుని అందచేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది అనన్య నాగళ్ల.

‘మన గౌరవనీయులైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసే అవకాశం వచ్చింది. వరద సాయం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి నా విరాళంగా 2.5 లక్షలు అందజేశాను. మిమ్మల్ని ప్రత్యక్షంగా చూసినందుకు చాలా ఆనందంగా ఉంది. మీ ఆతిథ్యానికి చాలా ధన్యవాదాలు. నేను ఈ క్షణాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను’ అని అనన్య ట్వీట్ చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు నటి అనన్య నాగళ్లను ప్రత్యేకంగా అభినందించారు. ఇక త్వరలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి చెక్ అందచేయనున్నట్లు తెలిపింది అనన్య. ప్రస్తుతం చంద్రబాబు, అనన్య కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో నెట్టింట వైరలవుతున్నాయి. అభిమానులు, నెటిజన్లు తెలుగు హీరోయిన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. వరద బాధితులకు సాయం చేసిన ఏకైక హీరోయిన్ అనన్య నాగళ్లనే.

ఇవి కూడా చదవండి

సీఎం చంద్రబాబుతో అనన్య నాగళ్ల..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..