The Goat Ott: ఓటీటీలోకి వచ్చేస్తోన్నా దళపతి విజయ్ గోట్.. స్ట్రీమింగ్ అప్పుడంటే..
సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు.
దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్‌తోపాటు ప్రభుదేవా, ప్రశాంత్, స్నేహ, మీనాక్షి చౌదరి, లైలా, వైభవ్, ప్రేమ్జీ తదితరులు నటించారు. ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అర్చన కల్పాతి ఈ చిత్రాన్ని నిర్మించారు. స్టార్ మ్యూజిక్ కంపోజర్ యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇక ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దాదాపు 400 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించింది. ఈ సినిమా మొదటి షో నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అలాగే తొలి రోజు భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది ఈ సినిమా.
ఇది కూడా చదవండి : పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!
ఇక ఈ సినిమాను థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీలో చూడాలని ఆశపడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు గోట్ సినిమా ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. గోట్ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ గోట్ సినిమా రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకుందని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి :Samantha : ఇండస్ట్రీలో ఆయనే నాకు గురువు.. స్టార్ హీరో పై ప్రేమ కురిపించిన సామ్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ విజయ్ గోట్ సినిమా డిజిటల్ రైట్స్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను అక్టోబర్ 11 నుంచి స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు టాక్ కోలీవుడ్‌లో వినిపిస్తుంది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటిల్ రైట్స్ ను రూ.110 కోట్లకు కొనుగోలు చేసింది. తెలుగు, తమిళ్, హిందీ,మలయాళ, కన్నడ భాషలో ఈ సినిమాను స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. మరి ఓటీటీలో ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా రూ. 400కోట్లవరకు వసూల్ చేసింది.
ఇది కూడా చదవండి : ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.