పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!

ఎన్నో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించాడు తేజ. ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో జయం సినిమా ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంత సులభంగా మరిచిపోలేరు. ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది ఈ మూవీ. తెలుగు సినిమాల్లో జయం సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది. 

పట్టుకుంటే కందిపోతుందేమో ఈ చిన్నది.. జయం సినిమా చిన్నది ఎంత అందంగా ఉందో..!
Jayam
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 17, 2024 | 8:33 PM

ఒకప్పుడు దర్శకుడు తేజ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే కుర్రకారు థియేటర్స్ దగ్గర క్యూ కట్టేవారు. తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలు చాలా వరకు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా యూత్ కు బాగా దగ్గరయ్యాయి. ఎన్నో ప్రేమ కథ చిత్రాలను తెరకెక్కించాడు తేజ. ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్‌లో జయం సినిమా ఒకటి. తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అంత సులభంగా మరిచిపోలేరు. ఒకప్పుడు ఓ ఊపు ఊపేసింది ఈ మూవీ. తెలుగు సినిమాల్లో జయం సినిమా ఓ ట్రెండ్ సెట్ చేసింది.  నితిన్ హీరోగా సదా హీరోయిన్ గా నటించారు ఈ సినిమాలో. అలాగే యాక్షన్ హీరో గోపీచంద్ విలన్ గా నటించి మెప్పించారు.

ఇది కూడా చదవండి :ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

ఈ సినిమాలో నటించిన అందరికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమాలో నటించిన చాలా మంది అప్పటికి కొత్తవారే  అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే ఆర్ఫీ పట్నాయక్ అందించిన మ్యూజిక్ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సిస్టర్ పాత్రలో కనిపించిన చిన్నది గుర్తుందా.?

ఇది కూడా చదవండి : చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

జయం సినిమాలో అక్షరాలు రివర్స్ లో రాస్తూ ప్రేక్షకులను అలరించింది ఆ చిన్నది. సినిమాలో ఆమె పాత్ర కూడా కీలకంగా ఉంటుంది. ఆ చిన్నారి పేరు యామిని శ్వేతా నాయుడు. జయం సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ అమ్మడు. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా నటించలేదు ఈ చిన్నది. జయం సినిమా తర్వాత చదువు పై దృష్టి పెట్టింది ఈ అమ్మడు. చాలా కాలం తర్వాత ఈ చిన్నారి ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు హీరోయిన్ లుక్ లోకి మారిపోయింది ఈ ముద్దుగుమ్మ. ఈ అమ్మడు పెళ్లి కూడా చేసుకుంది. సినిమాలకు దూరంగా ఉన్నా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు నిత్యం టచ్ లోనే ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.