Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master Case: టాలీవుడ్‌‌లో ప్రకంపనలు.. జానీ మాస్టర్ ఎక్కడ..? ఎందుకు స్పందించడం లేదు..

జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదయింది.. ఇటు పోలీసుల దర్యాప్తు సహా అటు ఫిల్మ్‌ ఇండస్ట్రీ నుంచి ప్యానెల్‌ ఇన్వెస్టిగేషన్‌ మొదలైంది. లైంగిక వేధింపుల ఆరోపణలు ప్రంకపనలు రేపాయి. మరి జానీ మాస్టర్‌ ఆవాజ్‌ ఏంటి?

Jani Master Case: టాలీవుడ్‌‌లో ప్రకంపనలు.. జానీ మాస్టర్ ఎక్కడ..? ఎందుకు స్పందించడం లేదు..
Jani Master
Shaik Madar Saheb
|

Updated on: Sep 17, 2024 | 8:32 PM

Share

నేషనల్‌ అవార్డ్‌ విన్నర్‌, స్టార్‌ కొరియోగ్రాఫర్‌ జానీ భాషాపై నమోదైన లైంగిక వేధింపుల కేసులో విచారణ స్పీడందుకుంది. 376, 506, 323 (2) సెక్షన్ల కింద కేసు ఫైల్‌ చేశారు నార్సింగ్‌ పోలీసులు. బాధితురాలిని ఆమె ఇంట్లో మూడు గంటల పాటు ప్రశ్నించారు. తనను లైంగిక వేధించాడని.. ప్రతిఘటిస్తే అవకాశాల్లేకుండా చేస్తానని బెదిరించాడని.. మతం మార్చుకొని తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తడి చేశాడని.. జానీ మాస్టర్‌ ఆయన భార్య తన ఇంటికి వచ్చి తనపై దాడి చేశారంటూ ఆమె చెప్పింది.. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసి న పోలీసులు ఆమెను భరోసా సెంటర్‌కు తరలించారు.

మరోవైపు జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల క్రమంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా వుండాలని ఆదేశించింది జనసేన. ఇక తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ కూడా స్పందించింది. వివాదం తేలే వరకు జానీ మాస్టర్‌ను డాన్సర్స్‌ అసోషియేషన్‌ అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని ఫెడరేషన్‌ను ఆదేశించింది.

ఇటు పోలీసులు.. అటు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏర్పాటు చేసిన ప్యానెల్‌.. తాజా వివాదంపై విచారణ చేపడుతున్నాయి. మరి ఆయనెక్కడ? స్పందనేంటి అనేది హాట్ టాపిక్ గా మారింది. లైంగిక వేధింపుల ఆరోపణలు, కేసుపై జానీ మాస్టర్‌ నుంచి ఇంకా స్పందన రాలేదు. గతంలోనే ఫిల్మ్‌ చాంబర్‌కు జానీ మాస్టర్‌ వేధిస్తున్నారని ఫిర్యాదు వెళ్లింది. అప్పుట్లో ఆయన ఆ మ్యాటర్‌పై స్పందించారు కూడా.. కానీ ఇప్పుడు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని పేర్కొంటున్నారు.

అసోసియేషన్‌కు సంబంధించి విభేదాలు, వివాదాల క్రమంలో జానీ మాస్టర్‌పై ఫిల్మ్‌ చాంబర్‌ ఏర్పాటు చేసిన ప్యానెల్‌కు ఫిర్యాదు వెళ్లింది. గత రెండు వారాలుగా పరిశీలన వుందన్నారు కమిటీ సభ్యులు. బాధితురాలు మొదట వర్క్‌ స్టేషన్‌లో హరాస్‌మెంట్‌ గురించి ఫిర్యాదు చేసిందన్నారు. అప్పట్లో బాధితురాలు సహా జానీ మాస్టర్‌ ఇద్దరి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశామన్నారు. కానీ లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు తెరపైకి వచ్చిందన్నారు. తాజా వివాదంపై కమిటీ విచారణ కొనసాగుతుందన్నారు 90 రోజుల్లో క్లారిటీ వస్తుందన్నారు. డ్యాన్సర్స్‌ అసోషియేషన్‌ పూర్తి సహకారం అందిస్తున్నారు. ప్రతీ యూనియన్‌ విధిగా కంప్లైంట్‌ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

లైంగిక వేధింపులపై విచారణ ప్యానెల్‌కు ఝాన్సీ చైర్‌ పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. దామోదర్‌ప్రసాద్‌ సెక్రటరీగా తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్‌, వివేక్‌ కూచిబొట్ట. ప్రగతి, మేడపాటి రామలక్ష్మి, లాయర్‌ కావ్య ప్యానెల్‌ సభ్యులుగా వున్నారు. జానీ మాస్టర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంలో POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుందన్నరు. వర్క్‌ స్టేషన్‌లో మహిళల భద్రతకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.