చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!

విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు విక్టరీ వెంకటేష్. అలా ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆతర్వాత మాస్ హీరోగా మారారు. అంతే కాదు ఆయన కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఇక విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వెంకటేష్.

చూస్తే బిత్తరపోవాల్సిందే..! దేవిపుత్రుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఎంత మారిపోయింది..!
Deviputrudu
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2024 | 8:15 PM

ఇప్పటికి హీరోగా రాణిస్తున్న సీనియర్ హీరోల్లో వెంకటేష్ ఒకరు. సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు వెంకీ. విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తుంటారు విక్టరీ వెంకటేష్. అలా ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకున్న ఆయన.. ఆతర్వాత మాస్ హీరోగా మారారు. అంతే కాదు ఆయన కామెడీ టైమింగ్ నెక్ట్స్ లెవల్ అనే చెప్పాలి. ఇక విభిన్నమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వెంకటేష్. వెంకీ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో దేవిపుత్రుడు సినిమా ఒకటి. కోడిరామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. సముద్రం అడుగున ఉన్న శ్రీకృష్ణుడి ద్వారకా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించింది.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

దేవీ పుత్రుడు సినిమాలో వెంకటేష్, సౌందర్య, అంజలా జవేరి ముఖ్య పాత్రల్లో నటించారు. మణిశర్మ సంగీత దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.  ఫాంటసీ డ్రామా గా వచ్చిన ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ద్వాపర యుగంలో నీట మునిగిన ద్వారక ఈ సినిమా కథకు ఆధారం. అయితే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన చిన్నది గుర్తుందా.?

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

వెంకటేష్‌తో కలిసి ఓ పాటల్లోనూ కనిపించింది ఆ చిన్నారి. ఈ చిన్నారి ఎవరు.? ఇప్పుడు ఎలా ఉంది.? అని చాలా మంది నెటిజన్స్ ఎదురుచూస్తున్నారు. ఆ చిన్నారి పేరు వేగా తమోటియా. చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన వేగా.. నిర్మాతగానూ చేసింది. ఆమె తమిళం, హిందీ అలాగే తెలుగు చిత్రాలలో నటించింది.. ఈ చిన్నది తెలుగులో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన హ్యాపీ హ్యాపీగా అనే సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేస్తుంది . కానీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ చిన్నదాని ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Vega

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.