Mrunal Thakur: లవ్ లైఫ్ గురించి చెప్పిన మృణాల్.. పాపం అన్ని బ్రేకప్సా..
గతంలో హీరోయిన్లు పర్సనల్ విషయాలు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు బ్యూటీ. డేటింగ్, బ్రేకప్ లాంటి విషయాలు కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు. తాజాగా మృణాల్ థాకూర్ కూడా ఇలాంటి విషయాలు రివీల్ చేశారు. నా లైఫ్‌లో చాలా బ్రేకప్స్ అయ్యాయి. కానీ కుంగిపోయేంతంగా ఏవీ బాధపెట్టలేదన్నారు మృణాల్ ఠాకూర్.
Updated on: Sep 16, 2024 | 8:14 PM

గతంలో హీరోయిన్లు పర్సనల్ విషయాలు మాట్లాడేందుకు పెద్దగా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తమ పర్సనల్ లైఫ్ గురించి కూడా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు బ్యూటీ. డేటింగ్, బ్రేకప్ లాంటి విషయాలు కూడా ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటున్నారు.

తాజాగా మృణాల్ థాకూర్ కూడా ఇలాంటి విషయాలు రివీల్ చేశారు. నా లైఫ్‌లో చాలా బ్రేకప్స్ అయ్యాయి. కానీ కుంగిపోయేంతంగా ఏవీ బాధపెట్టలేదన్నారు మృణాల్ ఠాకూర్. రీసెంట్‌గా ఏడు నెలల క్రితం కూడా ఓ వ్యక్తితో బ్రేకప్ చేసుకున్నా అని షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు.

గతంలో ఓ వ్యక్తి తన ప్రొఫెషన్ కారణంగా బ్రేకప్ చెప్పాడని గుర్తు చేసుకున్నారు. సరైన వ్యక్తి మన జీవితంలోకి వచ్చే వరకు వచ్చి వెళ్లే వాళ్లు చాలా మంది ఉంటారంటూ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు.

మీకు ఎవరు సూట్ అవుతారన్నది మీకే తెలుస్తుందంటూ తన ఎక్స్‌పీరియన్సెస్‌ను షేర్ చేసుకున్నారు. కెరీర్ పరంగానూ పక్కా ప్లానింగ్‌తో ఉన్నారు మృణాల్ ఠాకూర్. సీరియల్స్‌తో కెరీర్ మొదలు పెట్టి స్టార్ హీరోయిన్ రేసులోకి వచ్చిన ఈ బ్యూటీ, తెలుగులో సీతారామం, ఫ్యామిలీస్టార్, హాయ్ నాన్న లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.

అయినా ఎక్కువగా బాలీవుడ్ మీదే ఫోకస్ చేస్తూ అక్కడే అవకాశాల కోసం ట్రై చేస్తున్నారు. అందుకే మీడియా అటెన్షన్‌ను గ్రాబ్ చేసేలా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు.




