- Telugu News Photo Gallery Cinema photos Hari Hara Veeramallu shooting starting soon Pooja Hegde got a chance in vijay movie
Tollywood News: కొన్ని రోజుల్లో హర వీరమల్లు రీ స్టార్ట్.. గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన పూజ
పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అందుకోసం విజయవాడ దగ్గర్లో భారీ బ్లూమ్యాట్ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల మూడో వారం నుంచే షూటింగ్ రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్.
Updated on: Sep 16, 2024 | 10:07 PM

Hari Hara Veeramallu: పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరి హర వీరమల్లు. ఇప్పటికే ఆలస్యమైన ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. అందుకోసం విజయవాడ దగ్గర్లో భారీ బ్లూమ్యాట్ సెట్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ నెల మూడో వారం నుంచే షూటింగ్ రీస్టార్ట్ చేసే ఆలోచనలో ఉంది యూనిట్.

1000 కోట్లు అంటే ఒకప్పుడు చాలా పెద్దగా కనిపించేది.. కానీ దాన్ని కూడా మన హీరోలు మామూలు కలెక్షన్స్‌లా మార్చేస్తున్నారు. ఇప్పటికే తెలుగులో ప్రభాస్ రెండుసార్లు..

Saravanan: లెజెండ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన తమిళ బిజినెస్‌మేన్ శరవణన్, రెండో సినిమాను సిద్ధం అవుతున్నారు. సైలెంట్‌గా షూటింగ్ పనులు కానిచ్చేస్తున్నారు. తాజాగా ఆయన షూటింగ్ వెళ్లూ చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో మీడియా కంట పడ్డారు.

Manju Warrier: రజనీకాంత్ సినిమాలో అవకాశం రావటంపై స్పందించారు మంజు వారియర్. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న వేట్టయన్ సినిమాలో రజనీకి జోడి నటించారు ఈ సీనియర్ బ్యూటీ. ఇటీవల విడుదలైన పాటలో ఆమె లుక్, డ్యాన్స్ మూమెంట్స్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఫుల్ హ్యాపీగా ఉన్నారు మంజు వారియర్.

Pooja Hegde: స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు మరో గోల్డెన్ ఛాన్స్ దక్కింది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఆఖరి చిత్రంలో హీరోయిన్‌గా పూజాకు ఛాన్స్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. బీస్ట్ సినిమాలో విజయ్, పూజా కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి కలిసి నటిస్తుండటంతో దళపతి 69 మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి.




