ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే

వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో అపూర్వ ఒకరు. నటి అపూర్వ చాలా మందికి తెలిసిన నటే.. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి అపూర్వ.

ఈ అందాల నటి గుర్తుందా.? ఒకప్పుడు కుర్రాళ్ళ ఫెవరెట్ ఆమె.. ఇప్పుడు ఎలా ఉందంటే
Tollywood
Follow us
Rajeev Rayala

|

Updated on: Sep 16, 2024 | 7:08 PM

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. సినిమాలో కనిపించేది కొంత సేపే అయినా చాలా మంది తమ నటనతో ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. సురేఖ వాణి, హేమలతో పాటు చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. వారిలో అపూర్వ ఒకరు. నటి అపూర్వ చాలా మందికి తెలిసిన నటే.. అల్లరి సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి అపూర్వ. ఆ సినిమాలో ఆమె హీరో తల్లిగా నటించింది. వయసు చిన్నదే అయినప్పటికీ ఆమె అల్లరి నరేష్ తల్లిపాత్రలో నటించి మెప్పించింది.

ఇది కూడా చదవండి : Tollywood : తండ్రికి 5 పెళ్లిళ్లు.. కూతురుకి 3 పెళ్లిళ్లు.. అమ్మబాబోయ్ ఈ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పశ్చిమ గోదావరి జిల్లా, దెందులూరు గ్రామంలో జన్మించింది ఈ నటి. ఇక ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. వ్యాంప్ పాత్రలు కూడా పోషించింది అపూర్వ. నటనతో పాటూ తన అందంతోనూ ఆకట్టుకుంది అపూర్వ. ‘రెడీ’ ‘సీమటపాకాయ్’ ‘అఖిల్’ ‘డేంజర్’ ‘హరే రామ్’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ఇలా చాలా సినిమాల్లో నటించింది ఈ యాక్ట్రెస్.

ఇది కూడా చదవండి :దుమ్మురేపిన దేవుళ్ళు పాప..! అందాలు చూస్తే అదరహో అనాల్సిందే..!

ఇక ఇప్పుడు అపూర్వ సినిమాలు తగ్గించారు. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా ఉన్న అపూర్వ ఇప్పుడు అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియతో అభిమానులకు టచ్ లో ఉంటున్నారు. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు అపూర్వ. ఆమె ఇప్పుడు ఎలా ఉన్నారో చూడటానికి నెటిజన్స్ గూగుల్ ను తెగ గాలిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ ఫోటోలు వైరల్ గా మారాయి. అపూర్వ లేటెస్ట్ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి: సినిమాల్లో బోల్డ్‌గా కనిపిస్తే.. పెద్ద హీరోలతో ఆ పని చేయాలా..? అసలు విషయం బయటపెట్టిన నటి

అపూర్వ ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.