Jr NTR: జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ప్రత్యేక ప్రశంసలు
ఎవరికైనా ప్రాపర్ ఎంట్రీ ఉండాలి. అందులోనూ అది పాజిటివ్‌గా ఉండాలి. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చెప్పే మాటలు వేరు. సినిమా ప్రమోషన్లలో టీమ్ చెప్పే మాటలు వేరు. ఇప్పుడు తనతో పనిచేసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది జాన్వీకి. ఇంతకీ వాళ్లు ఏమన్నారు? శ్రీదేవి సౌత్ స్టారే అయినా, ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పారో లేదో... ఇది ఎప్పటికీ ఆడియన్స్ కి ఉన్న డౌట్.
Updated on: Sep 17, 2024 | 10:26 PM

ఎవరికైనా ప్రాపర్ ఎంట్రీ ఉండాలి. అందులోనూ అది పాజిటివ్‌గా ఉండాలి. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ చెప్పే మాటలు వేరు. సినిమా ప్రమోషన్లలో టీమ్ చెప్పే మాటలు వేరు. ఇప్పుడు తనతో పనిచేసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది జాన్వీకి. ఇంతకీ వాళ్లు ఏమన్నారు?

శ్రీదేవి సౌత్ స్టారే అయినా, ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పారో లేదో... ఇది ఎప్పటికీ ఆడియన్స్ కి ఉన్న డౌట్. మీకు అలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు. మాకు తెలుగుతో మంచి పరిచయమే ఉందని చెప్పకనే చెబుతున్నారు జాన్వీకపూర్. ఆమె లింగ్విస్టిక్ స్కిల్స్ చూసి ఆశ్చర్యపోతోంది టీమ్.

దేవర పార్ట్ ఒన్‌తో సౌత్ ఎంట్రీ ఇస్తున్నారు జాన్వీ కపూర్. మరి తెలుగు డైలాగులు ఎలా నేర్చుకున్నారు? ఈ విషయంలో జాన్వీకి ఫుల్ క్రెడిట్ ఇస్తున్నారు తారక్. ఆమె యాక్టింగ్ సూపర్బ్ అన్నారు. అంతే కాదు, ఆమె జ్ఞాపక శక్తి అమోఘం అంటున్నారు.

సందీప్ రెడ్డి వంగా చేసిన ఇంటర్వ్యూలో జాన్వీ స్కిల్స్ గురించి గొప్పగా చెప్పారు తారక్. ఆమె అద్భుతమైన టాలెంట్ ఉన్న వ్యక్తి. బాలీవుడ్ నుంచి వచ్చినప్పటికీ భలే చక్కగా డైలాగులు చెప్పారు .నేనే షాక్ అయ్యాను అని తారక్ చెబుతుంటే, వారెవా ఇది కదా డిస్టింక్షన్‌లో పాస్ కావడం అని మెచ్చుకుంటున్నారు.

సెప్టెంబర్ 27న విడుదల కానుంది దేవర పార్ట్ ఒన్. ఈ సినిమా కోసం ఆడియన్స్ తో పాటు తాను కూడా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నానని అంటున్నారు జాన్వీ. ఇంటర్నేషనల్ లెవల్లో ఈ సినిమా ఇంకో రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందన్నది ఈ బ్యూటీ చెబుతున్న మాట.




